Ketharinath Annadana Seva SamithiKetharinath Annadana Seva Samithi
Spread the love





కేథారినాథ్ అన్నదాన సేవా సమితి – సిద్దిపేట వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన వాహనాన్ని ప్రారంభించిన;రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త

ఈరోజు సిద్దిపేట జిల్లా, సిద్ధిపేట శరభేశ్వర దేవాలయం లో కేథారినాథ్ అన్నదాన సేవా సమితి – సిద్దిపేట ఆధ్వర్యంలో..శివకళ్యాణోత్సవము మరియు ఆహార పదార్థాల వాహన పూజ అనంతరం వాహనాన్ని సోన్ ప్రయాగు కు పంపించు కార్యక్రమము..లో ముఖ్య అతిధిగా శ్రీ.ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ పాల్గొని, కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారి చేతుల మీదుగా జెండా ఊపి ఉచిత అన్నదాన వాహనాన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించడం జరిగింది.

ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులకు భక్తి భావం ఎక్కువగా ఉంటుంది. ఎంతో ఆధ్యాత్మికంగా ఉంటారని అన్నారు.సీఎం కేసీఆర్ గారి నాయకత్వం.. TRS పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరిగింది. అన్నారు.రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్య జాతికి గుర్తింపు, గౌరవం దక్కింది. ఆర్యవైశ్యులకు న్యాయం జరిగింది అన్నారు. ఉప్పల్ భాగాయత్ లో 5 ఎకరాల భూమిని కూడా ఇచ్చారని, రాజకీయంగా కూడా ఆర్యవైశ్యుల కు పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని అన్నారు.ఎటువంటి పదవులు ఇచ్చినా నీతి నిజాయితీ తో కష్టపడి పని చేస్తారని అన్నారు. సిద్దిపేట ముద్దుబిడ్డ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోటి రూపాయలు ఇచ్చి అయినా కోమట్లతో సోపతి చేయమని చెప్తుంటారని గుర్తుచేశారు.అన్ని కులాలు,మతాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఒక్క ఆర్యవైశ్య కులానికి మాత్రమే ఉంటుంది అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్యులకు గౌరవం దక్కింది.
ముఖ్యంగా ఆర్యవైశ్యులకు 4 గురుకి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు.. 11 మందికి మున్సిపల్ చైర్మన్ పదవులు, ఒకరికి ఎమ్మెల్సీ పదవి, ఒకరికి ఎమ్మెల్యే పదవి, ఒకరికి 40 సంవత్సరాలు తర్వాత తెలంగాణ యూనివర్సిటీ కి వైస్ ఛాన్సలర్ గా, ఒకరికి టీటీడీబోర్డ్ మెంబర్ గా అవకాశం దక్కింది, అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతున్నది.ఆర్యవైశ్య పేదలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. కేసీఆర్ గారి నాయకత్వం లో రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. గతంలో పవర్ హాలిడేస్, కరెంట్ కోతలు ఉండేవి. ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తూ రాష్ట్రంలో వర్తక వ్యాపారులు అందరూ ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారని అన్నారు. ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. మంత్రి హరీశ్ రావు గారి నాయకత్వం లో సిద్దిపేట జిల్లా ను న:భూతో న;భవిష్యత్.. లాగా అభివృద్ధి చేశారని, తెలంగాణ లోనే నెంబర్ వన్ నియోజకవర్గం గా తీర్చిదిద్దారని అన్నారు. ఆర్యవైశ్యుల కోసం నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని అన్నారు.రాబోయే రోజుల్లో IVF ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు, పేద ఆర్యవైశ్యుల కోసం, మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు.నా వంతు సహకారాన్ని అందిస్తానని తెలిపారు.ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ గారు తన వంతు సాయంగా కేథారినాథ్ అన్నదాన సేవా సమితి – సిద్దిపేట వారికి అన్నదానం కోసం 5 క్వింటాల బియ్యం కూడా ఇస్తానని అన్నారు.

ఈ కార్యక్రమంలో.. శ్రీమతి వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ గారు సిద్దిపేట జిల్లా పరిషత్ చైర్ పర్సన్, శ్రీమతి కె.మంజుల రాజనర్సు గారు చైర్ పర్సన్ పురపాలక సంఘం సిద్దిపేట, శ్రీ పాల సాయిరాం గారు మార్కెట్ కమిటీ చైర్మెన్ అనురాగ్ పూర్, శ్రీ నందిని శ్రీనివాస్ గారు మార్కెట్ కమిటి వైస్ చైర్మెన్, కౌన్సిలర్ మల్లికార్జున్ మరియు కేథారినాథ్ అన్నదాన సేవా సమితి – సిద్దిపేట ప్రెసిడెంట్ మధు, జనరల్ సెక్రటరీ అయిత రత్నాకర్, సాంబమూర్తి,అనిల్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *