gothrasgothras
Spread the love





🙏జై వాసవి   జై జై వాసవి 🙏

 తిరుపతిలో ఉన్న ఆర్యవైశ్య కుటుంబ సభ్యులందరికీ విజ్ఞప్తి రాబోయే శుక్రవారం మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతి అయినటువంటి శ్రావణ శుక్రవారం రెండో వారం అందునా వరలక్ష్మి వ్రతం ఈ సందర్భంగా మన ఆలయంలో మన అమ్మవారికి ఉదయం 4 గంటలకి పంచామృత అభిషేకం నిర్వహించబడును మార్పును గమనించగలరు.


ఉదయం ఎనిమిది గంటలకి వరలక్ష్మి నోములు పూజ ప్రారంభం చేయడానికి సన్నాహం చేస్తున్నాం ఆలయానికి వచ్చే భక్తులను బట్టి బ్యాచ్లుగా ఈ పూజ నిర్వహణ ఉంటుంది.

 🙏🙏 ఈ శుక్రవారం గర్భాలయంలో అమ్మ వారు బంగారు చీర తో అమ్మవారి నాగ పడగ జడ మొదలగు అమ్మవా రీ బంగారు ఆభరణములతో దర్శన భాగ్యం ఇవ్వబోతోంది అలాగే వేంచేపు మండపంలో ఉత్స వర్లు ప్రత్యేక అలంకారంతో దర్శనం ఇవ్వబోతున్నారు.

సాయంకాలం అమ్మవారికి లలితా సహస్రనామం పారాయణం తరువాత వివిధ రకములు అయినటువంటి పండ్లు ఈ శుక్రవారం నైవేద్యంగా సమర్పించి తదుపరి మహా మంగళహారతులు నిర్వహించబడును.

కావున ఆర్యవైశ్యు లు సభ్యులు ఎల్లరు ఆలయానికి విచ్చేసి అమ్మవారిఆశీస్సులు
పొందవలసిందిగా పేరుపేరునా ఆహ్వానాన్ని తెలుపుతున్నా ము 🙏🙏🙏

ఇట్లు
శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయ పాలకమండలి కొత్త వీధి తిరుపతి
🌹🌹🌹🌹
ముఖ్య గమనిక ÷ఈ శుక్రవారం అమ్మవారికి ఏదేని పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *