vasaviclubvasaviclub
Spread the love

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారి ఉద్దేశ్యాలు మరియు లక్ష్యాలు

1) స్నేహము (Fellowship)
2) సేవ (Service)
3) నాయకత్వము (Leadership)

అలాగే మన సంస్థ ద్వారా 4 పథకాలు నిర్వహి స్తున్నారు అవి

1) కె సి జి ఎఫ్ ( కల్వకుంట్ల చంద్రసేన గుప్త ఫెల్లో షిప్)  

2) సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీమ్

3) శ్రేయోభిలాషి పథకం

4) వాసవి కుటుంబ సురక్ష పథకం (VKSP & SR. VKSP)

మన సంస్థ వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గురించి తెలుసుకుందాం!

మొట్ట మొదటి వాసవి క్లబ్  1 అక్టోబర్  1961 న హైదరబాద్ లో స్థాపించడం జరిగింది .

సంస్థ వ్యవస్థాపకులు కీర్తి శేషులు కల్వకుంట్ల చంద్రశేన గుప్త గారు (k.C.Gupta) .

అంతర్జాతీయ వాసవి క్లబ్ (Vasavi Clubs International) 23 డిసెంబరు 2008 న రిజిస్ట్రేషన్ చేయబడినది .

రిజిస్ట్రేషన్ నంబరు 800/2008 .

11 మంది సభ్యులతో మొట్ట మొదటి వాసవి క్లబ్ ఏర్పాటు చేయడమైనది . ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 1800 క్లబ్స్ లలో 93,000 వేల మంది సభ్యులు ఉన్నారు .

కె సి జి ఎఫ్ –  కె సి గుప్తా ఫెలోషిప్ –  వాసవి సరస్వతి పథకం

వాసవి క్లబ్ వ్యవస్థాపకులు కల్వకుంట్ల చంద్రశేన గుప్త (కె. సి. గుప్త) గారి పేరున  “కార్పస్ ఫండ్” (నిధుల సేకరణ) సేకరించవలెనని 1995 లో KCGF ను ప్రవేశపెట్టడం జరిగింది . VCI లో అత్యున్నతమైన గౌరవ ప్రదమైన గుర్తింపును వ్యక్తిగతంగా ఇచ్చుచున్నది .

వాసవి ఉద్యమంలో కె. సి. గుప్త ఫెలోషిప్ ఒక ముఖ్యమైన గుర్తింపునిచ్చే KCGF గా ప్రఖ్యాతిగాంచింది . ఎవరైనా ఆర్యవైశ్యులు 2500/- చెల్లించి భాగస్వామి అయినచో KCGF  దాతగా , అత్యధికమైన గుర్తింపును పొందెదరు .

ఈ నిధి ని డిపాజిట్ చేసి దానిపై వచ్చే వడ్డీ ని ప్రకృతి విపత్తులు  మరియు వాసవి సరస్వతి పథకం ద్వారా పేద విద్యార్థులకు విద్యా సహాయము చేసెదరు .

గుడ్ స్టాండింగ్ క్లబ్స్ కు 5000/- రూపాయలు నిరుపేద విద్యార్థులకు సహాయము చేయు నిమిత్తము ఇచ్చెదరు .

2500/- రూపాయలు ఇచ్చిన దాతకు పిన్ మరియు షీల్డ్ ఇచ్చెదరు . ఈ షీల్డ్ పై వాసవి క్లబ్ మోనోగ్రామ్ , కె .సి. గుప్త గారి ఫోటో మరియు దాతపేరు చెక్కబడి వుండును.

సెల్ఫ్  ఎంప్లాయిమెంట్ స్కీమ్

వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ వారు వైశ్యులలో ఆర్థికంగా వెనుబడిన వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో జీ ఎమ్ ఆర్ , గ్రంధి సుబ్బారావు , వరలక్ష్మి ఫౌండేషన్ తదితరుల నుంచి నిధులు సేకరించి ఒక్కొక్కరికి 25000/- రూపాయలు వడ్డీ లేని రుణం (పేద వైశ్యులకు) మంజూరు చేసి తిరిగి నెలకు 2500/- చొప్పున 10 నెలలలో వసూలు చేసి మరలా కొత్త వారికి రుణం మంజూరు చేయడం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం .

శ్రేయోభిలాషి పథకం

ఒకప్పుడు జి యమ్ ఆర్ లాంటి వారు వైశ్యులలో ఆర్ధికంగా వెనుకబడిన వారికి వడ్డీ లేని రుణాలను అందచేసే  ఉద్దేశంతో మన సంస్థ లో ఒక నిధిని ఏర్పాటు చేశారు. ఆర్ధికంగా వెనుకబడిన వైశ్యులకు ఎవరికైనా  రుణం కావాలంటే ఒక్కొక్కరికి 25000/- వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తారు . అలా తీసుకున్న రుణం తిరిగి నెలకు 2500/- చొప్పున 10 నెలలలో చెల్లించవలసి ఉంటుంది. అయితే 2019 లో అప్పటి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవియన్ వేముల హజరతయ్య గారు ఒక చక్కటి ఆలోచన చేశారు . ఎవరైతే 20000/- రూపాయలు ఆర్ధికంగా వెనుకబడిన వారిని ఆడుకోవడం కొరకు విరాళంగా ఇస్తారో వారి పేరుతో మరియు వారు చెప్పిన వారికి రుణాన్ని అండచేయటం జరుగుతుంది . ఇలా ఒకరికి అందచేసిన రుణం తిరిగి వసూలుచేసి మరొకరికి ఇవ్వడం జరుగుతుంది . 


Spread the love

By Admin

One thought on “వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ గురించి తెలుసుకుందాం.”
  1. మాది మండపేట డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా. వాసవి క్లబ్ లో మెంబెర్ గా అవ్వడానికి ఎక్కడ కలవాలి. మాది చిన్న shop నేను వికలాంగుడను. Please reply email &ఫోన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *