gothrasgothras
Spread the love

ప్రముఖ శైవక్షేత్రమైన కాశీ పుణ్యక్షేత్రంలో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన సత్ర సముదాయము లేక ధర్మశాల “*I.V.F. *బెనారస్* ఆనంద నిలయం

ప్రపంచంలోనే అతి ప్రాచీనమైన నగరముగా కాశీ మహానగరమునకు పేరున్నది. ఈ కాశీ మహానగరం పురాతన సంస్కృతి, నాగరికత కలగలిసిన మహా శైవ క్షేత్రం ఈ కాశీ నగరం. హిందువులకు అతి పవిత్రమైన పుణ్యస్థలం. శ్రీ విశ్వేశ్వరుడు, విశాలాక్షి మరియు అన్నపూర్ణ సమేతంగా కొలువున్న మహా పుణ్యక్షేత్రం ఈ కాశీ నగరం. పవిత్ర గంగా నదిలో స్నానమాచరిస్తే తమ జీవితంలో తాము తెలిసి తెలియక చేసిన అన్ని తప్పులు, పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

కనుక హిందువులకు ఇది పరమ పవిత్ర పుణ్యక్షేత్రముగా విలసిల్లుతున్నది. ఎవరైనా ఈ కాశీ క్షేత్రంలో మరణిస్తే వారికి జరా మరణములు ఉండవని, మరల పునర్జన్మ ఉండదని, వారికి కైలాస వాసం ప్రాప్తిస్తుందని, అందరి ప్రగాఢ నమ్మకము మరియు విశ్వాసం. ప్రస్తుతం కాశీ మహానగరంను 600 కోట్ల రూపాయలతో 33 ప్రాజెక్టుల ద్వారా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ఆధునీకరించారు. అంతేకాక మరొక 1200 కోట్ల రూపాయలును వెచ్చించి 13 ప్రాజెక్ట్ లను చేపట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ కాశీ క్షేత్రంలో ముఖ్యంగా చెప్పుకోవలసినవి గంగా నది యొక్క ఘాట్లు లేదా స్నాన ఘట్టాలు. వీటన్నింటినీ ఇప్పుడు అత్యంత సదుపాయములతో ఆధునీకరించారు.

ఇటువంటి పురాతన మరియు మహిమాన్విత శైవ క్షేత్రమైన కాశీ మహానగరంలో ప్రపంచంలోని నలుమూలల నుండి వచ్చే భక్తులందరికీ అత్యంత అధునాతన వసతులు వస్తువులతో వసతి సౌకర్యములతో కూడిన సత్ర సముదాయము లేదా ధర్మశాలను ” I.V.F. బెనారస్ ఆనంద నిలయం ” అను పేరున నిర్మించడానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వారు పూనుకున్నారు. ఈ నిర్మించ తలపెట్టిన సత్ర సముదాయము లేదా ధర్మశాల ప్రదేశం శ్రీ కాశీ విశ్వనాధుని ఆలయమునకు 14 కిలోమీటర్ల దూరంలోనూ మరియు కాశీ విమానాశ్రయమునకు 10 కిలోమీటర్ల దూరంలోనూ, కాశీ రింగ్ రోడ్డుకు (అంతర్గత వలయమునకు) చేరువులో ఉన్నది. ఈ ఆనంద నిలయం నుండి శ్రీ విశ్వేశ్వరుని ఆలయమునకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మరియు మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు సత్ర సముదాయము నుండి ఆలయమునకు, ఆలయం నుండి సత్ర సముదాయమునకు ఉచిత రవాణా సదుపాయంను కల్పించనున్నారు. అదేవిధంగా ప్రతీ రోజూ విమానాశ్రయం నుండి సత్ర సముదాయమునకు అలాగే సత్రం నుండి విమానాశ్రయమునకు 24 గంటలు ఉచిత రవాణా (పికప్ అండ్ డ్రాపింగ్) సదుపాయమును కల్పించనున్నారు.

ధర్మశాల లేదా సత్రంలో సదుపాయములు లేదా వసతులు:

HEREDITARY LAND DONARS ( వారసత్వ స్థల దాతలు ):

54,000 /- రూపాయలు చెల్లించిన వారికి ఒక సంవత్సరంలో 9 రోజులు వసతి ఇవ్వబడుతుంది. అందు నిమిత్తము 9 రోజులు వసతి కూపన్లు జారీ చేస్తారు.

a. వారికి 75 శాతం రాయితీతో వసతి కల్పించబడును.

b. వారు తెలియపరచిన 12 మంది కుటుంబ సభ్యులకు సంవత్సరంలో 9 రోజులు మాత్రమే 75 శాతం రాయితీతో వసతి కల్పించబడును.

c. వారు పంపిన లేదా వారి ద్వారా వచ్చిన బంధువులు లేదా స్నేహితులకు (వారు తెలియపరిచిన 12 మంది కాని వారు) 30 శాతం రాయితీతో పై 9 కూపన్లు ద్వారా మాత్రమే వసతి కల్పించబడును.

d. అంతేకాక వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం మరియు రాత్రి భోజనం లేదా ఫలహారంను ఉచితంగా ఏర్పాటు చేయబడును.

HEREDITARY DELUXE ROOM DONARS ( వారసత్వ డీలక్స్ రూమ్ దాతలు ):

5 లక్షలు రూపాయలు చెల్లించిన వారికి :

a. రూము వద్ద దాత యొక్క పేరు మరియు వివరములు ప్రదర్శించబడును.

b. దాత 1 సం. లో 90 రోజులు పాటు వసతి సదుపాయాన్ని పొందవచ్చు.

c. వారు తెలిపిన 12 మంది కుటుంబ సభ్యులకు 75 శాతం రాయితీతో వసతి కల్పించబడును.

d. వారు పంపిన లేదా వారి ద్వారా వచ్చిన బంధువులు మరియు స్నేహితులకు పైన తెలిపిన వసతి కూపన్లు ద్వారా 30 శాతం రాయితీతో వసతి కల్పించబడును.

PERMANENT INHABITANTS ( శాశ్వత నివాసితులు ):

10 లక్షలు రూపాయలు చెల్లించిన వారికి శాశ్వత నివాస వసతి కల్పించబడుతుంది. (నామ మాత్రపు నిర్వహణ మరియు విద్యుత్ ఖర్చులు చెల్లించవలెను)

a. పై వ్యక్తి తన తదనంతరం తాను తెలియపరచిన/పేర్కొన్న నామినీకి ” వారసత్వ డీలక్స్ రూమ్ దాత ” హోదా కల్పించబడును.

ముఖ్య గమనిక :

ప్రతీ డోనర్ ఒక రోజుకు ఒక రూమును మాత్రమే రాయితీతో పొందగలరు. ఒకే సారి గ్రూప్ గా వచ్చినచో ఒక రూముకు మాత్రమే రాయితీ ఇవ్వబడును. మేనేజిమెంట్, అవసరమును బట్టి భక్తుల సహాయార్థం నియమ నిబధనలను సవరించ వచ్చును.

I.V.F. బెనారస్ ఆనంద నిలయం

ఈ ఆనంద నిలయంను 1 సెల్లార్ మరియు 6 అంతస్తులులో నిర్మించదలచినారు. సెల్లార్ పార్కింగ్ నిమిత్తం ఉంచి, మొదటి అంతస్థులో రిసెప్షన్, మీటింగ్ హాల్, నిర్వాహకులు గది, పూజ గది, వంటశాల, భోజనాల హాల్, స్నానపు గదులు మరియు శౌచాలయములు, 2వ, 3వ, 4వ, 5వ మరియు 6వ అంతస్థులలో, అంతస్థుకు 80 రూములు/గదులు చొప్పున నిర్మించబడును. అలాగే భవనం పై కప్పుపై 12 అడుగులు ఎత్తులో సౌర ఫలకాలు (Solar Panels)ను ఏర్పాటు చేసి వాటి ద్వారా స్వయం విద్యుత్ ను ఉత్పత్తి చేసుకునేందుకు ప్రణాళిక చేస్తున్నారు. వాటితో పాటు 30,000 అడుగుల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణం ఏర్పాటు చేయబడుతుంది.

భక్తులందరకూ ఉచిత భోజన సదుపాయము కల్పించబడును.

నిత్య అన్నదానము

భక్తులు అన్నదాన నిమిత్తము వెయ్యి రూపాయలు చొప్పున వారి ఇచ్ఛానుసారం విరాళం ఈయవచ్చును.

25,000/- రూపాయలు విరాళం ఇచ్చిన దాతలకు వారి పేరున 1 సం. లో ఒక రోజు అనగా జన్మ దినం/ వివాహ దినం/ వారికి నచ్చిన రోజున వారి పేరున అన్న సంతర్పణ జరుపబడును. మరియు వారి పేరును భోజనశాలలో ప్రదర్శింపబడును. మరియు వారికి 30 శాతం రాయితీతో కూడిన 5 వసతి కూపన్లు జారీ చేయబడును.

50,000/- రూపాయలు విరాళం ఇచ్చిన దాతలకు 1 సం.లో 3 రోజులు వారికి నచ్చిన రోజులలో వారి పేరున అన్న సంతర్పణ జరుపబడును. మరియు వారి పేరును భోజనశాలలో ప్రదర్శింపబడును. మరియు వారికి 30 శాతం రాయితీతో కూడిన 9 వసతి కూపన్లు జారీ చేయబడును.

1,00,000/- విరాళం ఇచ్చిన దాతలకు 1 సం.లో 7 రోజులు వారికి నచ్చిన రోజులలో వారి పేరున అన్న సంతర్పణ జరుపబడును. మరియు వారి పేరును భోజనశాలలో ప్రదర్శింపబడును. మరియు వారికి 30 శాతం రాయితీ తో కూడిన 18 వసతి కూపన్లు జారీ చేయబడును. విరాళములు ఇచ్చు దాతలుకు ముఖ్య విజ్ఞప్తి:

విరాళము అందించే దాతలు నేరుగా క్రింద తెలిపిన బ్యాంక్ ఖాతాకు జమ చేయవచ్చును.

I.V.F. బెనారస్ ఆనంద నిలయం
ఖాతా నెంబరు: 09540100027374
బ్యాంక్ ఆఫ్ బరోడా
ఖైరతాబాద్ బ్రాంచి
హైదరాబాద్
IFSC కోడ్: BAROKHAIRA

విరాళం జమ చేసిన తర్వాత ఆ వివరములును పంపవలసిన చిరునామా:

I.V.F. బెనారస్ ఆనంద నిలయం
ఇంటి నెంబరు: 2-2-674/A/99,
బాగ్ అంబర్ పేట్,
హైదరాబాద్.

అంతేకాక మీరు పంపిన విరాళం విషయములును క్రింద తెలిపిన ఏ మేనేజింగ్ ట్రస్టీకి అయినా తెలియపరచగలరని ముఖ్య విజ్ఞప్తి (త్వరిత నిర్ణయములు తీసుకొనుటకు)

I.V.F. శ్రీ గంజి రాజమౌళి గుప్త
98490 18555
I.V.F. శ్రీ ఉప్పల శ్రీనివాస్
88811 99999
I.V.F. శ్రీ మద్దుల రాంజీ
98480 40655
I.V.F. శ్రీ ఉడత పురుషోత్తం
98490 35556
I.V.F. డాక్టర్ విశ్వేశ్వరరావు పూసర్ల
98481 98489
I.V.F. శ్రీ సత్తన్న
93911 33277


Spread the love

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *