International Vaishya Federation financial assistance to Arya Vaishya studentsInternational Vaishya Federation financial assistance to Arya Vaishya students
Spread the love

వ్యాపారం, సేవా కార్యక్రమాల్లో ఆర్యవైశ్యులు ముందున్నప్పటికీ రాజకీయాలలో పూర్తిగా వెనుకబడి ఉన్నారని నిజామాబాద్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా అన్నారు. రాజకీయంగా ఆర్యవైశ్యులు రాణించాలని ఆయన సూచించారు. ఆదివారం ముషీరాబాద్‌లోని ఆర్యవైశ్యభవన్‌లో ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్‌ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా మాట్లాడుతూ గతంలో ఏ పార్టీ కూడా ఆర్యవైశ్యులకు ఉన్నత పదవుల కేటాయింపులో న్యాయం చేయలేదని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ మాత్రం వైశ్యులకు పదవుల కేటాయింపులో పెద్దపీట వేశారని అన్నారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, చైర్మన్‌ పదవులను ఇచ్చి ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఆర్యవైశ్యులలో పేదవారు ఉన్నారని గుర్తించిన సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు వర్తింపజేసేలా రూపకల్పన చేశారని తెలిపారు. ఎమ్మెల్యే ముఠాగోపాల్‌ మాట్లాడుతూ ఆర్యవైశ్యులకు ఉప్పల్‌లో 10 ఎకరాల స్థలం కేటాయించి ఆర్యవైశ్య భవనానికి నిధులు కూడా విడుదల చేశారని పేర్కొన్నారు.

విద్యావ్యాప్తి, దేవాలయాల అభివృద్ధి, వైద్యం పేదలకు అందేలా ఆర్యవైశ్యులు అందిస్తున్న సేవలు ఆదర్శనీయమన్నారు. రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌గుప్తా మాట్లాడుతూ వైశ్యుల సంక్షేమానికి వైశ్య కార్పొరేషన్‌ను త్వరలో సీఎం కేసీఆర్‌ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. ఐఏఎస్‌, ఐపీఎస్‌ విద్యనభ్యసిస్తున్న ఆర్య వైశ్య విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 1లక్ష చొప్పున ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఆర్థిక సహాయం అందిస్తున్నదని అన్నారు. త్వరలో ఇంజినీరింగ్‌, వైద్య, విద్యను అభ్యసించే విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆర్యవైశ్యులకు పదవుల కేటాయింపులో న్యాయం చేస్తున్నందున కేసీఆర్‌ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ కార్యనిర్వహణ అధ్యక్షుడు గంజిరాజమౌళి గుప్తా, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌, ఫెడరేషన్‌ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు చంద్రయ్య, మహిళా కమిటీ అధ్యక్షురాలు లక్ష్మీసుజాత, ప్రముఖ సినీనటి కరాటే కల్యాణి పాల్గొన్నారు.


Spread the love

By admin

3 thoughts on “ఆర్య వైశ్య విద్యార్థులకు ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆర్థిక సహాయం(International Vaishya Federation financial assistance to Arya Vaishya students)”
  1. Iam studying intermediate second year, but 1st year fee pending vundhi kattakapothe online class ki link evvaranta sir

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *