sathramsathram
Spread the love

ద్వారకాతిరుమల క్షేత్ర శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీ ఆర్య వైశ్య కళ్యాణ మండప ట్రస్ట్ వారి నిత్యాన్నదాన భవనం.


వ్యాపారి తన సంపాదనలో కొంత భాగం ధర్మ కార్యాలకు ఉపయోగిస్తారు. అన్ని దానాలకన్న అన్నదానమే శ్రేష్టమని నమ్ముతారు. దేవాలయాల్లో దైవదర్శనం చేసుకున్న ఆర్యవైశ్యులకు భోజన సదుపాయము కల్పించాలన్న ఉద్దేశ్యముతో భారత దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల పరిసరాల్లో ఆర్య వైశ్య నిత్యాన్న సత్రాలను ఏర్పరచి వచ్చిన భక్తులకు భోజన సదుపాయాలు కల్పిస్తున్నారు.

దేవాలయాలకెళ్లే ప్రతి ఆర్యవైశ్యుడు సత్రాల్లో భోజనం చేయలనుకుంటాడు. అలాగే ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి
వారి క్షేత్రంలో కూడా అన్నదానం చేయాలని ఇక్కడ ఉన్న ఆర్య వైశ్య పెద్దలు అనుకుని ఓ కమిటీగా ఏర్పడి స్థలం ఏర్పాటు చేసి భవన నిర్మాణము చేయాలని అన్నదానం ,రుములు, కళ్యాణ మంటపం నిర్మించాలని అనుకున్నారు.అలా ప్రారంభ కార్యక్రమంలో ఆ ఉరి వారితో పాటు ఇంకా జిల్లా పెద్దలు కలిశారు.కళ్యాణ మండపం పనులు చేస్తున్నారు. అలాగే అన్నదానం భవనం శంఖుస్థాపన 24- 11- 1999 సంవత్సరం ప్రారంభించి 17 – 2 – 2000 సం” అంటే 83 రోజుల్లో భవనం నిర్మించి గృహప్రవేశం చేశారు.

హైదరాబాద్ కు చెందిన ప్రముఖులు శ్రీ గంజి రాజ మౌళి గుప్తా గారు అయుదు లక్షల రూపాయలు, మరియు ఎంతో మంది ప్రముఖుల ఆర్ధిక సహాయం … పాలకవర్గ సభ్యుల ఆశయం, పని చెయ్యాలి అనే దృక్పథం కలిపి తక్కువ సమయములో బిల్డింగ్ పూర్తి చేశారు.

అప్పటి నుంచి ఒక వంట తెలిసిన అమ్మాయి,ఒక పనమ్మాయి,ఒక గుమస్తాతో… సేరుంపావు అంటే మనకు అర్ధం అవ్వాలంటే కేజీ పైన పావు కిలో సుమారుగా అన్నము వండటం ప్రారంభించి క్షేత్ర దర్శనం చేసుకుని వచ్చిన వారికి అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ…గత ఇరవై సంవత్సరాలుగా పది లక్షల మందికి అన్నదానం చేశారు .

అమ్మ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆశీస్సులు, దాతల సహాయం కలిసి అన్నదానం చెయ్యటం సాధ్యం అయ్యింది. అన్నదానం వల్ల కలిగే విశిష్టత చెప్పి ధనాన్ని సేకరించడంలో బొండాడ రాంపండు గారు మరియు అప్పటి కార్యవర్గం కృషి చేసి అభివృద్ధి చేయడం ఆ తెచ్చిన డబ్బులను సద్వినియోగం చేశారు.

అలాగే కొంత మంది దాతలు సరుకులు ఇచ్చేవారు,నూనె డబ్బాలు,కూరలు ,పచ్చళ్ళు, కొందరు కంది పప్పు,ఇంకొందరు బియ్యం వారి శక్తి కొలది ఇప్పటికీ అన్నదానం నిమిత్తం పంపిస్తూనే ఉన్నారు.


గుంటూరుకు చెందిన క్రేన్ వక్కపలుకులు గ్రంధి సుబ్బారావు గారు 2006 లో అయిదు లక్షల రూపాయల దాతృత్వం అలా ఇంకా ఎందరో సహాయం చెయ్యటం వల్ల అన్నదానం నిరంతరం సాగుతూ ఉంది. ఎంత డబ్బులు ఉన్నా పని చేసే వారు కుదరకపోతే చాలా ఇబ్బంది. కానీ ఇక్కడ అన్నదానం ప్రారంభించిన నాటి నుండి అమ్మ వారి మహిమతో పాటు , చక్కటి నిర్వహణా సామర్ధ్యం కలిగి ఉన్న పని వారు దొరకటం విశేషం. అన్నదాన కమిటీ సభ్యులు ఎంత మంది మారినా వారు చూపిన శ్రద్ధ వల్ల గొప్పగా జరుగుతోంది.

ఎక్కడెక్కడి నుంచో వచ్చిన భక్తులు ఆకలి తీర్చుకుని వాళ్ళు కొంత దన సహాయం చేసి వెళ్తున్నారు.ఇక్కడ అన్నదాన కమిటీ సభ్యుడు జగన్నాథరావు గారు అన్నదానం దాని ప్రాముఖ్యత చెబుతూ , ఆహారం వృదా చేయకుండా ఉండేలా చూడటం , దాతలను గౌరవిస్తూ కొత్తగా భోజనానికి వచ్చిన వారికి ట్రస్ట్ ఉద్దేశాన్ని తెలియచేసి మరింత ఆర్ధిక సహాయం చేసేలా చేస్తారు అన్నదాత సుఖీభవ అనిపిస్తారు.ఆయనతో పాటు మిగతా అందరూ సభ్యులు సలహాలు సూచనలు చేస్తూ సంస్థను అభివృద్ధి చేశారు.

మన అమ్మ సంస్థ లక్ష రూపాయలు ఇచ్చినపుడు ఏడవ పేరు ఇపుడు నలభై మంది లక్ష రూపాయల చొప్పున ట్రస్ట్ కు ఇచ్చారు అవి బ్యాంక్ లో డిపాజిట్ చేసి వడ్డీని వాడతారు ఇంత చక్కటి నిర్వహణ చేస్తున్న పాలకవర్గ సభ్యులకు ,దాతలకు అభినందనలు .

( అక్షర రూపం రంగనాథ్ మాటూరి )


Spread the love

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *