పెడన పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవీ క్షేత్రము నందు ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభమై అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్న దసరా పండుగను పురస్కరించుకొని గూడూరు రోడ్ లోని స్థానిక శ్రీ వాసవీ క్షేత్రము ముందు పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొల్లూరి చిన్నా అత్యంత భక్తి శ్రద్ధలతో చలువ పందిరి గుంజకు పసుపు కుంకుమలతోపూజా కార్యక్రమం నిర్వహించి ప్రతిష్టించారు.ఈ సందర్భంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొల్లూరి చిన్న మాట్లాడుతూ గత 47 సంవత్సరములుగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ వాసవి క్షేత్రంలో దసరా మహోత్సవాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నారు అని ఈ 48వ సంవత్సరం కూడా విజయవంతం కావాలని ఆకాంక్షించారు గుంజ ప్రతిష్ట పూజా కార్యక్రమంలో పాల్గొన్న వారిలో మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కొత్త ఫణి భూషన్ రావు, పట్టణ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి కె టి మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు చిట్టూరి పశుపతినాథ్ బాబు, చిలకల శ్రీనివాస్ గుప్తా, కొల్లిపర పూర్ణ ప్రదీప్, జల్లూరి రాంబాబు,
కొల్లిపర నరసింహారావు, ఆర్గనైజింగ్ కార్యదర్శి కొల్లూరి రాజా, కార్యదర్శులు జవాజి నాగు, కోడూరి రమేష్, ఉత్సవములు కమిటీ కన్వీనర్ కొల్లూరి రాధాకృష్ణ గుప్తా, కోశాధికారి తాడేపల్లి కృష్ణ కృష్ణ ప్రసాద్, కార్యవర్గ సభ్యులు ఆత్మకూరి సురేష్, భోదినపల్లి శ్యాంప్రసాద్, కొల్లిపర పవన్, తమ్మన శివ నాగరాజు, మాటూరి వెంకటేశ్వరరావు, జల్లూరి సత్యనారాయణ, కొత్త గుండు వెంకటరత్నం, వేముల రమేష్,
సభ్యులు జల్లూరి కోటేశ్వరరావు, తాడేపల్లి రామకృష్ణ, కొల్లిపర రమేష్, పట్టణ శ్రీ వాసవి మహిళా మండలి సభ్యులు జల్లూరి ధనలక్ష్మి, తమ్మన శ్రీవల్లి, కొల్లిపర గాయత్రి తదితరులు పాల్గొన్నారు.