నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్ లో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ అధ్యక్షులు టంగుటూరు రామకృష్ణ, ఉపాధ్యక్షులు రాజశేఖర్ ,జిల్లా అధ్యక్షులు రాజగోపాల్, కోఆర్డినేటర్ ఇల్లూరు లక్ష్మయ్య, వాసవి సత్రాల సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు, ఎస్.కే.మహేష్ మహిళా విభాగం ప్రతినిధులు జ్ఞానేశ్వరమ్మ, రాజ్యలక్ష్మి, పద్మజా, ఉమా దేవితో పాటు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో ప్రతిభ కనబరిచిన ఆర్యవైశ్య విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు .ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్, రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులను ఐక్యమత్యంగా ఉంచేందుకు వీలుగా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభను ఏర్పాటు చేశామని వివరించారు. స్థాపించిన అనతి కాలంలోనే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విజయవంతంగా కొనసాగుతుందని వివరించారు. ఆర్యవైశ్యులందరినీ బలోపేతం చేయడంతో పాటు వారి గౌరవాన్ని పెంపొందించేలా ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు.
ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించి ఎన్నో సంస్థలు ఉన్నాయని, కానీ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ మరింత శక్తివంతంగా ఎదుగుతుందని చెప్పారు .ఏ సంస్థకైనా మంచి కార్యవర్గం ఉంటే ఆ సమస్య చేపట్టే కార్యక్రమాలకు సహకారం అందించేందుకు దాతలు ముందుకు వస్తారని చెప్పారు. అన్ని సంస్థలలో లాగే దురదృష్టవశాత్తు ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించిన కొన్ని సంస్థల్లో కార్యవర్గం సరిగా లేకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని చెప్పారు.
సంస్థకు చెందిన ఆస్తులు అన్యాక్రాంతమైనప్పుడు వాటిని కాపాడేందుకు తన శక్తివంతులైన కృషి చేస్తున్నానని వివరించారు .ఈ క్రమంలో కొన్ని సందర్భాల్లో ఫ్యాక్షన్ లీడర్లను సైతం నియంత్రించామని చెప్పారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆర్యవైశ్య సామాజిక వర్గం ప్రజలు ఉన్నారని అయితే భాషాపరంగా వారి వారి భాషలు మాట్లాడుతున్నారని అది గుర్తించాలని చెప్పారు.
దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఆర్యవైశ్యులు ఐకమత్యంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, ఇందుకు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చొరవ చూస్తుందని వివరించారు. వచ్చే ఏడాది ప్రారంభంలో దుబాయిలో జరిగే ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సమావేశాలకు మన దేశం నుండి అధిక సంఖ్యలో ఆర్యవైశ్యులు కావాలని పిలుపునిచ్చారు.
విద్యార్థులు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా జనరల్ నాలెడ్జ్ ని పెంచుకుంటే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సూచించారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. అందువచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఆర్యవైశ్య విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని చెప్పారు.
‘ప్రతిభ’ ఆర్యవైశ్యులకు… అభినందన: టీజీ భరత్
అనంతరం యువ యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ మాట్లాడుతూ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ చేపడుతున్న కార్యక్రమాలను అభినందించారు. ప్రతిభ ఉన్న ఆర్యవైశ్య విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం అభినందనీయమని చెప్పారు. విద్యార్థులు పుస్తకాలకే పరిమితం కాకుండా జనరల్ నాలెడ్జ్ ని పెంపొందించుకోవాలని కోరారు.రానున్న భవిష్యత్తు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దే అన్న విషయాన్ని గుర్తించి అందుకు తగిన విధంగా సిద్ధం కావాలని చెప్పారు.
ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో రాణించాలంటే విషయ పరిజ్ఞానాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. అనంతరం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు టంగుటూరి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు రాజశేఖర్ ,కోఆర్డినేటర్ ఇల్లూరు లక్ష్మయ్య జిల్లా అధ్యక్షుడు, రాజగోపాల్ తదితరులు మాట్లాడుతూ ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించి దేశవ్యాప్తంగా కొండంత అండగా ఉన్న రాజ్యసభ మాజీ సభ్యులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ డిజి వెంకటేష్కు ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ద్వారా ఆర్యవైశ్యులందరినీ ఏకం చేస్తున్నారని వివరించారు .కుల మతాలు రాజకీయాలకతీతంగా దశాబ్దాలుగా టీజీ వెంకటేష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అందరికీ స్ఫూర్తిదాయకమని చెప్పారు. ఆయన చూపిన బాటలోనే తామంతా పయనిస్తున్నామని వివరించారు. అనంతరం ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్ర ప్రదేశ్ నార్త్ విభాగం అధ్యక్షులుగా కోన శ్రీనివాసరావు జనరల్ సెక్రటరీగా నరసింహారావుతో కూడిన నూతన కార్యవర్గము ప్రమాణ స్వీకారం చేశారు. వీరందరినీ రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ,యువ పారిశ్రామికవేత్త టీజీ భరత్ తదితరులు అభినందించారు..