వాసవి మాతా సత్యప్రియ జగతికిమూలం నీవమ్మ
కన్యకదేవి అవతారం జగమంతటికి ఆధారం
మల్లెపూవులు తెచ్చితిమి మనసును నీకెఇచ్చితిమి
వాసవులంత చేరితిమి నీ పారాయణము చేసితిమి
పద్మరేకుల కాంతులతో పసిడి మెరుపుల మెరియంగా
హంసవాహిని రూపిణిగా వెలసితివమ్మ కన్నెమ్మ
తెల్లని వస్త్రం దరియించి మల్లెమాలను వేసుకుని
భక్తి మార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి
పెనుగొండాపురి వాసవిగా కన్యకదేవి రూపముగా
వెలసితివమ్మ నీవమ్మ దర్ఱన మీయగ రావమ్మ
వాసవి మాతా దర్ఱనము సిరి సంపదలకు ఆహ్వానం
కలియుగమందున నీరూపం కల్మషనాషిని నీవమ్మ
కుసుమరాజునకు పుత్రికగా కుసుమాంబా కూతురిగా
జనయించితివి లోకాన జనులందరికి దేవతగా
అందం చందం నీవమ్మ గుడికే అందం నీవమ్మ
దర్శన మీయగ రావమ్మ కష్టాలను కడ తేరషచమ్మ
తెల్లని వస్త్రము ధరియించి శాంతికిరూపం చప్పావు
చల్లగ దీవెన ఇచ్చావు సంతోషాన్ని పెంచావు
దేవయలంతా నూటొక్కటి శాంతి దేవతవు నీవమ్మ
వైశ్యుల ఇంట నెలసితివి ధనలక్ష్మిగా నీవమ్మ
విరూపాక్షునికి సోదరిగా వైశ్యులందరికి దేవతగా
వెలసితివంట మాయింట భూయిలలో నిలిచావంట
చీరా రవికా కోరితివి పసుపు కుంకంమలు అడిగితివో
భక్తి మార్గము తెలిపితివి భక్తుల మనసును దోచోతివి
సమాధి నిన్ను కొలవంగా తపస్సు నిన్ను మెచ్చంగా
దర్శన మీయగ వచ్చితివి కోరిన కోర్కెలు తీర్చితివి
ఏడువందల పదునాల్గు గోత్రములున్నాయి మనకంటు
నిలిచాయంట నూట్రోండు వాసవోవెంట మనమంతా
పెనికుల గోత్రిణి వాసవోగా పెనుగొండాపురి వాసవిగా
సిరిసంపదలు ఇవ్వమ్మ పాప హారిణి రావమ్మ
శంఖ చక్రము ధరియించో విష్ణు వర్దనంని హతమార్చో
లోకమాతగా వెలిసావు భక్తుల మదోలో నిలిచావు
దేవతలంతా వనగూడి సిరములొంచి మ్రొక్కంగా
పసిడివెన్నల కాంతులతో పాదపద్మములు మెరవంగా
త్రిశూలధారిణి మాతవుగా త్రిభువన పాలిని దెవతగా
తల్లివి తండ్రివి నీవేగా గురువు దైవము నీవేగా
ఆర్యవైశ్యకుల దేవతగా వైశోధారణ మాతవుగా
విశ్వరూపము చూపితివి జ్ఞాన మార్గమును నింపితివి
ఎన్నోరూపాలున్నాయి అంతట నీవేవున్నావు
ఏపేరున నిను పిలిచాము ఏరూపముగా కొలిచేము
సోమదత్తుని పుత్రికగా సౌభాగ్యవతి కానుకగా
భూలోకానికివచ్చితివి భక్తుల కోర్కెలు తిర్చోతివి
దుర్గా ఖాళి అవతారం దయచూపంగా వచ్చితివి
దర్శన మీయగ రావమ్మ కనక దుర్గ అవతారం
వరాలన్ని వరలక్ష్మి దీవెనలన్న ఇవ్వమ్మ
కష్టాలన్ని తొలగించి శాంతి సుఖములు ఇవ్వమ్మ
అద్బుత మైనది నీమహిమ అతిసుందరము నీరూపం
అద్బుత మైనది నీమహిమ అతిసుందరము నీరూపం
కరుణించమ్మ లలితమ్మ కాపాడమ్మ కామాక్షమ్మ
దర్శన మీయగ రావమ్మ కోరిన కోర్కెలు తీర్చమ్మ
సర్వే శ్వరుని ప్రియసతిగ జగమంతటికి కన్నవుగా
వైశ్యల సేవలనందుకుని అంతట నీవే నిండితివి
నలభై రోజుల మాలంట వాసవి మాతా మాకంతా
ఆత్మార్పన రోజున మేమంతా పెనుగొండాపురి చేరెదము
అంబ భవాని నీరూపం అద్భుత మైనది నీనామం
అతిసుందరము నీదర్శనం అద్భుత మైనది నీరూపం
వైశ్యులంతా రారండి దేవీ రూపము చూడండి
అమ్మకు నీరాజనం ఇవ్వండి వాసవి దీవెన పొందండి
భక్తవ శంకరి నీవమ్మ గగనా శంకరి నీవమ్మ
అందరి శ్రేయస్సు కోరెదవు వాసవి మాతా నీవమ్మ
ఆర్య వైశ్యులను భ్రోవంగ భువిలో వెలసిన వాసవిగా
దుష్ట శిక్షన సలపుటకై అవతరించితివి భువిలోన
ఛిధ్రూపిణివి నీవమ్మ చిద్విలాసినివి నీవమ్మ
శక్తి దాయినివి నీవమ్మ మక్తిదాయినివి నీవమ్మ
హరిషట్వర్గము తొలగించి సద్గుణావళిని చేకూర్చి
మోక్షమొసంగె దేవతగా చల్లని తల్లివి నీవమ్మ
శక్తి పీటమై వెలగంగా సుప్ర సిద్దమై పెరవంగ
దివ్య మహిమలు చూపించు తేజోరూపిణి నీవమ్మ
భవభయ హారివి నీవమ్మ కామేశ్వరివి నీవమ్మ
సర్వవ్వాపిని నీవమ్మ దీనుల గావగ రావమ్మ
భక్తుల కోర్కెలు తీర్చుటకై పెనుగొండాపురిలో వెలసి
నీమహిమలను కొనియాడగా ఆది శేషుని తరవమ్మ
పెనుగొండాపుర మందున వాసవి కన్యక దేవతగా
భక్త జనావళి భ్రోవంగా శక్తి మాతగా వెలసితివి
మంగళ గౌరి నీరూపం మనసుల నిండా నింపితివి
వాసవి దేవికి మనమంతా మంగళ హారతు లిధామ
వాసవీ మాతా చాలీసా ప్రతీ దినం పటించినచో దరి చేరలేవు నీ శోకాలు కలుగునులే శాంతి సుఖాలు
జై వాసవీ మాతా , జై జై వాసవీ మాతా