హైదరాబాద్కు చలో! – ‘వైశ్య రాజకీయ రణబేరి’ ప్రారంభానికి ముస్తాబైంది
‘Chalo Hyderabad’ – Arya Vaishya Political Movement Gears Up
వైశ్య సమాజ ఐక్యతను ఉద్దేశంగా చేసుకుని ‘వైశ్య రాజకీయ రణబేరి’ పేరిట భారీ సంఘటనకు నగరవైశ్యులు సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 3వ తేదీ, ఆదివారం రోజున నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభం కానుంది.
ఈ కార్యక్రమం ప్రముఖ ఉద్యమ కారుడు, విద్యావేత్త, సంఘ సేవకుడు డా. కాచం సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో జరుగనున్నది. రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో వైశ్యుల హక్కుల సాధన కోసం ముందడుగు ఈ రణబేరి.
కార్యక్రమ ప్రధాన లక్ష్యాలు:
- EWS కోటాలో వైశ్యుల గుర్తింపు సాధన
- విదేశీ విద్యకు ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం
- రాష్ట్ర-జాతీయ స్థాయిలో వైశ్య కమిషన్ ఏర్పాటు
- కార్పొరేషన్కు ప్రత్యేక నిధులు కేటాయింపు
- పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా రాజకీయ పదవుల్లో ప్రాతినిధ్యం
- నామినేటెడ్ పదవుల్లో భాగస్వామ్యం
ఈ మహాసభ ఏ సందర్భంలోనూ రాజకీయ పార్టీలకు సంబంధించేది కాకుండా, కేవలం సమాజాభివృద్ధి కోసం చేసే ఉద్యమంగా నిర్వాహకులు తెలిపారు.
విద్యార్ధులు, ఉద్యోగులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, తెలుగు రాష్ట్రాల సోదర, సోదరీమణులు అందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని, తమ వైశ్య సోదరులతో సమాచారం పంచాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.
“మన కోసం, మన పిల్లల భవిష్యత్ కోసం పోరాటంలో భాగస్వాములమవుదాం. మన ఐక్యతే మన బలమై, మన హక్కులను సాధించాలి.” అని డా. కాచం సత్యనారాయణ గారు హ్వదయపూర్వక పిలుపునిచ్చారు.
జై వాసవి మాత!
‘Chalo Hyderabad’ – Arya Vaishya Political Movement Gears Up
Hyderabad, August 1:
The Arya Vaishya community is coming together for a major socio-political gathering titled “Vaishya Rajakeeya Ranabheri” (Vaishya Political War Drum), scheduled to be held on Sunday, August 3, at the Nampally Exhibition Grounds, Hyderabad, from 3:00 PM onwards.
The movement is being led by renowned activist, educationist, and social reformer Dr. Kacham Satyanarayana, aiming to bring unity and political awareness among the Arya Vaishya community.
Key Demands of the Movement:
- Recognition under EWS (Economically Weaker Sections) category
- Financial aid for students pursuing education abroad
- Establishing Vaishya Commissions at the State and National levels
- Allocation of funds to Vaishya Corporations
- Fair share in political roles like Sarpanch, MPTC, ZPTC, MLA, MP
- Appointment to nominated positions in governance
Organizers have clarified that the event is non-political and non-affiliated with any party, purely intended to work for the upliftment and unification of the Vaishya community.
All students, professionals, entrepreneurs, women, youth and elders of the Vaishya society are invited to join and spread the word within their circles.
“This is a people’s movement—for our future, for our next generation. Let’s unite for our honor, our rights, and our rightful place in society,” urged Dr. Kacham Satyanarayana.
Jai Vasavi Mata! 🌸