విశాఖ మహిళ నాగసూర్యవరలక్ష్మి కి విశ్వకవిసమ్మేళనం కవితా పోటీల్లో ద్వితీయబహుమతి
JUNE 15, 2021 0167Views
SHARE
ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ (WAM) గ్లోబల్ లిటరరీ ఫోరం మరియు మానసభారతి సాహితీ వేదిక ఆధ్వ ర్యంలో నిర్వహించిన అంతర్జాల విశ్వకవిసమ్మేళనం కవితా పోటీల్లో విశాఖ జిల్లా పరవాడ మండలం గొర్రెల వానిపాలెం పంచాయితీ పోర్టికో టౌన్ షిప్ కు చెందిన నల్లా నాగ సూర్య వరలక్ష్మి ద్వితీయ బహుమతి గెలు చుకుని విశాఖ సత్తా చాటారు.
ఆదివారం జూమ్యాప్ ద్వారా నిర్వహించిన అంతర్జాల విశ్వకవి సమ్మేళనంలో ఆమె పాల్గొని తన కవితా ప్రతిభను ప్రదర్శించారు. మనలో మనోబలం-కరోనా తిరోగమనం అనే అంశంపై జరిగిన కవిత సమ్మేళనంలో ప్రపంచవ్యాప్తంగా ఎందరో పాల్గొని తమ తమ కవితలను వినిపించారు.మాజీ ముఖ్యమంత్రి కే.రోశయ్య స్థాపించిన వామ్ గ్లోబల్ లిటరరీ ఫోరం ప్రపంచ రికార్డుల గ్రహీత,కవిరత్న డాక్టర్ చింతల శ్రీనివాస్ నేతృత్వంలో ఎంతో మంది ప్రముఖు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉపాధ్యాయినిగా విధులు నిర్వాహిస్తూన్న నల్లా నాగ సూర్య వరలక్ష్మి చందన అనే కలం పేరుతో వ్యాసాలు,కవితలు రాస్తుం టారని నిర్వాహకులు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులు పాల్గొన్న అంతర్జాల విశ్వకవి సమ్మేళనంలో ఈమె ద్వితీయ బహుమతి గెలుచుకోవ డం పట్ల విశాఖకు చెందిన ఎంతోమందిసాహితీ ప్రియు లు,ప్రముఖులు ఆమెకు అబినందనలు తెలిపారు.
టౌన్ షిప్ కు చెందిన స్థానిక ప్రజలు, తోటిఉపాధ్యాయులు, విద్యార్థులు,బంధుమిత్రులు ఆమెకుశుభాభివందనాలు తెలిపారు.