కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ పట్టణంలో జరిగిన “వాసవి మహా యాగం” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న; తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు..
ఈరోజు ఉదయం కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా, అసిఫాబాద్ పట్టణ కేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. ఆర్యవైశ్య భవన్ ఆవరణలో జరిగిన “వాసవి మహా యాగం” 102 హోమ గుండాలతో జరిగిన పూజా కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీ. ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు విచ్చేశారు ఈ సందర్భంగా.. ఋత్వికులు,
వేద పఠనం చేసి, మంత్ర జపం, హోమంలో ప్రత్యేక పూజలు.. చేశారు. వైభవంగా హోమం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా.. ఈ కార్యక్రమంలో వందల మంది భక్తులు పాల్గొనడం జరిగినది. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు గణపతి హోమం మహా మృత్యుంజయ హోమం నిర్వహించడం జరిగింది.ఈ హోమాల పూజా కార్యక్రమానికి విచ్చేసిన సందర్భంగా చైర్మన్ గారిని శాలువతో సన్మానించడం జరిగింది. తదనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు..
ఈ సందర్భంగా టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గారి పాలనలోనే ఆర్యవైశ్యులకు న్యాయం జరిగింది. అన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్యవైశ్య జాతికి గుర్తింపు, గౌరవం దక్కింది. ఆర్యవైశ్యులకు న్యాయం జరిగింది.అని అన్నారు. రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాల కాలంలో ఆర్యవైశ్యులను గుర్తించి, వారికి ప్రాముఖ్యత ఇచ్చింది. న్యాయం చేసింది, సీఎం కేసీఆర్ గారు ఒక్కరు మాత్రమే.. ఉప్పల్ భాగాయత్ లో 5 ఎకరాల భూమిని కూడా ఇచ్చారని, రాజకీయంగా కూడా ఆర్యవైశ్యుల కు పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. ఆర్యవైశ్యులు వ్యాపారం చేయడంలో మాత్రమే కాదు, సామాజిక సేవలోను ముందుంటారని అన్నారు.ఎటువంటి పదవులు ఇచ్చినా నీతి నిజాయితీ తో కష్టపడి పని చేస్తారని అన్నారు. సిద్దిపేట ముద్దుబిడ్డ, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కోటి రూపాయలు ఇచ్చి అయినా కోమట్లతో సోపతి చేయమని అన్నారని గుర్తుచేశారు.అన్ని కులాలు,మతాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండే అవకాశం ఒక్క ఆర్యవైశ్య కులానికి మాత్రమే ఉంటుంది అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఆర్యవైశ్యులకు గౌరవం దక్కింది.
ముఖ్యంగా ఆర్యవైశ్యులకు 4 గురుకి స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు.. 11 మందికి మున్సిపల్ చైర్మన్ పదవులు, ఒకరికి ఎమ్మెల్సీ పదవి, ఒకరికి ఎమ్మెల్యే పదవి, ఒకరికి తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా కూడా అవకాశం దక్కింది అని అన్నారు.తెలంగాణ రాష్ట్రం పారిశ్రామికంగా దూసుకుపోతున్నది.ఆర్యవైశ్య పేదలు కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. కేసీఆర్ గారి నాయకత్వం లో రాష్ట్రంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. గతంలో పవర్ హాలిడేస్, కరెంట్ కోతలు ఉండేవి. ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన కరెంట్ అందిస్తూ రాష్ట్రంలో వర్తక వ్యాపారులు అందరూ ప్రశాంతంగా వ్యాపారం చేసుకుంటున్నారని అన్నారు. టూరిజం తరపున ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం కృషి చేస్తానని అన్నారు. ఆర్యవైశ్య భవనం నిర్మాణం కోసంనా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో.. కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా జడ్పీచైర్ పర్సన్ కోవలక్ష్మి గారు, కాగజ్ నగర్ మున్సిపల్ వైస్ చైర్మన్ రాచకొండ గిరీష్, పెనుగొండ వాస్తయ్యులు నర్సింహా చార్యులు, ప్రధాన అర్చకులు భాస్కరాచారి గారు, రాజ శేఖర్ శర్మ గారు, మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు రేణికుంట్ల శ్రీనివాస్,వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ బాల సంతోష్,కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా IVF అధ్యక్షుడు చిలువేరు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి గుండా ప్రమోద్, కోశాధికారి గుండా వెంకన్న, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గంధం శ్రీను, రవీందర్, ప్రదాన కార్యదర్శి బోనగిరి వేణుగోపాల్,గర్రెపెళ్లి గోపాల్, వెంకటేష్,TRS నాయకులు, వాసవి క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.