Display Image Kapil Kapil Business Park
Spread the love

కుజ గ్రహ దోషానికి సాధారణ పరిహారములు

1· సింధూర వర్ణ ఆంజనేయ స్వామికి ఏడు మంగళ వారములు ప్రదక్షిణాలు చేయాలి

2· ఎర్రని పుష్పాలు మాల సుబ్రహ్మణ్య, ఆంజనేయ స్వామి గుడిలో స్వామికి అలంకరించాలి.

3· బెల్లం కలిపిన ఎర్రని కందిపప్పు గోవుకు తినిపించాలి.

4· మంగళవారము రోజున ఎర్రని కుక్కకు ఆహారం వేయాలి.

5· స్త్రీలు ఏడు మంగలవారాలు ఏడుగురు ముతైదువులకు ఎర్రని పూలు , ఎర్ర జాకెట్, ఎర్ర గాజులు, ఎర్ర కుంకుమ, దానం చేయాలి.

6· ఎర్ర చందనం, కందులు, ఎర్ర మేక, దానిమ్మ పండ్లు ఎర్రవస్త్రాలలో కట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో వీలు అయితే, లేదా ఇన్న్తి వద్ద అయిన సరే దానం ఇవ్వాలి.

7· కోతులకు తీపి పదార్థములు తినిపించాలి.

8· రాగి పాత్రలో నీరు తాగటం, రాగి పాత్రలు వాడటం మంచిది.

9· పోట్లకాయలు తరగటం, మంచిది కాదు.

10· రక్త దానము చేయుట చాల మంచిది.

11· అమ్మవారికి (దుర్గ) ఎర్ర చీర సమర్పించటం, నవగ్రహ గుడిలో కుజ విగ్రహం వద్ద ఎర్రపులతో పూజ పగడ దానం, ఎర్రరవికలగుడ్డ దానం మంచిది.

12· కుజుని అధిష్టాన దేవుడు సుబ్రహ్మణ్య స్వామికి ఉపవాసం ఉంది, కండి పప్పుతో చేసిన పదార్ధాలు తినాలి.

13· రాగిపళ్ళెంలో కందులు, కందిపప్పు పోసి దక్షిణ తామ్బులంతో మంగళవారం మధ్యాహ్నం ఒక యువకుడికి దానం చేయాలి.

14· కుజ గ్రహం వల్ల కలిగే రోగములకు ఎర్రటి కుండలో అన్నం వండి, ఎర్రవస్త్రంలో మూట కట్టి, దాని మీద దీపం వెలిగించి రోగికి దిష్టి తీసి కుక్కలకు అన్నం పెట్టుట ద్వార నయం అవుతుంది. కాని డాక్టర్ దగ్గర మందులు మానేయ కూడదు.

15· కుజుడు అన్నదమ్ములకు కారకుడుగా చెప్తారు, మూడవ ఇంట్లో ఉంటె ఎన్నో చిక్కులు వస్తాయి. ఏనుగు దంతం వస్తువు ఇంట్లో దక్షిణం పక్క ఉంచి కుజుని ఆరాధించాలి.

16· ఏడు, ఎనిమిది స్థానాలలో కుజుడు ఉంటె డబ్బు ఉన్న సుఖము ఉండదు, అందుకని ఏడు మంగళ వారాలు సిరా స్నానం చేసి దక్షిణ దిశలో మూడు వాతుల దీపం వెలిగించి సాయంకాలాలు కుజ స్తోత్రము, సుబ్రహ్మణ్య పారాయణం చేయాలి, ఉపవాసం ఉండి కందిపప్పుతో తాయారు చేసిన ఆహారము తీసుకుంటే భార్య భర్తలు గూడా సంతోషంగా ఉంటారు, సమయాని డబ్బు అందుతుంది.

17· కుజుని వలన స్వర పేటికకు సంబంధించిన వ్యాధులు వ్దస్తే మంగళ వారం, క్రుత్హిక నక్షత్రం రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించి గంట, దీప దానము చేసిన సమస్య తొలగును.


Spread the love

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *