సంతాన భాగ్యం కోసం పరితపిస్తున్నారా?
ఈ అవకాశం మీ కోసమే…
వరంగల్ శ్వేతర్క మూల గణపతి ఆలయం లో అత్యంత అరుదైన పుత్ర కామేష్టి యాగమును నిర్వహిస్తున్నారు.
పాల్గొని సంతానం ను పొందగలరు..
శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయంలో వసంతోత్సవం
ప్రతి ఏడాది వసంత ఋతువులో, భక్తి మరియు ఆధ్యాత్మికత యొక్క పరిమళాలు కాజీపేట శ్వేతార్కగణపతి దేవాలయంలో వ్యాపించినట్లుగా ఉంటాయి. ఈ సంవత్సరం, శ్రీశ్వేతార్కమూలగణపతిస్వామివారి 26వ వసంతోత్సవం మరియు కళ్యాణోత్సవములు మహా శోభాయమానంగా జరుగనున్నాయి.
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ మాధవానందసరస్వతిస్వామివారి మరియు శ్రీశ్రీశ్రీ మధుసూదనానందసరస్వతిస్వామివారి ఆశీస్సులతో, గురువరేన్యులు బ్రహ్మశ్రీ ఒజ్జల రాధాకృష్ణశర్మసిద్ధాంతిగారి అనుగ్రహంతో, ఈ ఉత్సవాలు మరింత పావనమైనవిగా మారనున్నాయి. ఐనవోలు అనంతమల్లయ్య శర్మ సిద్ధాంతిగారి ఆశీస్సులతో, ఈ వేడుకలు భక్తులకు మరియు యాత్రికులకు అపూర్వమైన అనుభవంగా మారనున్నాయి.
ఈ వసంతోత్సవంలో ఒక ప్రత్యేక ఆకర్షణ పుత్ర కామేష్టి యాగము. ఈ యాగం సంతానం కోసం అత్యంత పురాతనమైన మరియు పవిత్రమైన వేదికలలో ఒకటి.
కాజీపేట శ్వేతార్కగణపతి క్షేత్రంలో అత్యంత విశేషంగా వేద పండితులచే సంతానదోషాలు తొలిగి శీఘ్ర సంతానం కోసం పుత్ర కామేష్టి యాగము జరుగును. అలనాడు త్రేతాయుగంలో దశరధ మహారాజు సంతాన ప్రాప్తి కోసం పుత్రకామేష్టి యాగము చేసి కారణ జన్ములగు శ్రీరామ, లక్ష్మణ, భరత, శతృఘ్నులను పొందాడు. విశేషమైనటువంటి ఈ పుత్రకామేష్టి యాగంలో నూతన దంపతులు, సంతానం లేనటువంటివారు, ముఖ్యంగా పుత్ర సంతానం పొందగోరు వారు మరియు సంతానపరమైన సమస్యలు కలవారు పాల్గొన్నచో వారికి ఇష్టకామ్యార్ధ సిద్ధి కలిగి వంశవృద్ధి జరుగును. కావున ఈ మహత్తరమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని, భగవంతుని అనుగ్రహం పొందగలరని దేవాలయ కమిటీ మనవి చేస్తున్నది.
యాగంలో పాల్గొను దంపతులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రధారణలో రావలెను మరియు ఉదయం 07.00 గంటల వరకు దేవాలయానికి చేరుకొగలరు.
అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని భగవంతుని అనుగ్రహం పొందగలరని మనవి. ముఖ్యగమనిక: యాగంలో పాల్గొను దంపతులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రధారణలో రావలెను. యాగంలో పాల్గొను దంపతులు ముందుగా తమ పేర్లను దేవస్థానమునందు ఇవ్వవలెను. యాగంలో పాల్గొను దంపతులు ఉదయం 07.00 గంటల వరకు దేవాలయానికి చేరుకొనవలెను. ఈ యాగం ఫలితంగా సంతాన వంశాభివృద్ది పొందగలరు.
సపరివార సమేత స్వయంభు శ్రీశ్వేతార్కమూలగణపతి దేవాలయముల క్షేత్రం శ్వేతార్కమార్గ్, విష్ణుపురి, కాజీపేట, వరంగల్ అర్బన్.జి.
యాగంలో పాల్గొను దంపతులు 9347080055, 9505102545 నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకొనగలరు.