🇮🇳✨
” మీ మీద ఎన్ని విమర్శలున్నా…మీరు గొప్ప ఆదర్శవంతులు..క్రమశిక్షణ,పట్టుదల, థైర్యం,మీ దగ్గరే నేర్చుకోవాలి.. జీవితకాలమంతా అహింసా,సత్యాగ్రహం పదాలను వదలని మార్గదర్శకులు మీరు…20 వ శతాబ్థంలో ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వ్యక్తులలో మీరే అత్యంత శక్తివంతులని మొదటిస్థానం ఇచ్చారు ప్రపంచ ప్రజానీకం..మీ బోసినవ్వులను చూసి చిన్నప్పుడు మా గాంధీతాత అమాయకుడేమో అనుకున్నాము..కానీ మీరెంత ధృఢచిత్తులో,మానసికంగా ఎంత శక్తివంతులో తర్వాత తెలిసింది. ఐన్ స్టీన్ అంతటి మేధావి మీ గురించి చెబుతూ “ఈ భూగోళం మీద ఇటువంటి ఒక వ్యక్తి జీవించి నడిసాడు అంటే నమ్మశ్యంగా లేదు” అన్నాడంటే నిజమే అనిపిస్తుంది..శరీరంగా బలహీనులేమో గానీ మానసికంగా చాలా ,చాలా శక్తివంతులు మీరు. దేశవిభజన భరించలేని మీరు మౌనరూపం దాల్చారు,. ఎన్నో త్యాగాలతో సిద్ధించిన ఈ స్వాతంత్రఫలాలను నా భారతజాతి ఎంతకాలం నిలుపుకుంటుందోనని మధనపడ్డ మీరు..నిజంగా ఈ రోజు జీవించివుండి వుంటే అమరణదీక్షచేసి అమరులై వుండేవారు..
“మహాత్మా!!! మీరు కాకతాళీయంగా అన్నారో,ముందు చూపుతో అన్నారోగానీ…”అర్థరాత్రి పూట ఆడది ఒంటరిగా,నిర్భయంగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని..కానీ అర్థరాత్రి ఒంటరిగా తిరగడం ఏమోగానీ “పట్టపగలు”వందలమంది సమక్షంలో కూడా ఆడది ఒంటరిగా తిరగలేనంత దౌర్భాగ్యస్థితిలో వుందయ్యా..భారతస్త్రీ!!!
“మీరు ఏవైతే తిరస్కరించేవో అవే కులం,మతం,ప్రాంతీయవాదం భారతదేశమంతా రాజ్యమేలుతున్నాయి..ప్రజలందరూ మతాల,కులాల,ప్రాంతాల వారీగా చీలిపోయారు,.
అదెంతా ఎందుకు మహాత్మా!!! స్వాత్రంత్ర వీరులను సహితం కులాలవారీగా,మతాల వారీగా,ప్రాంతాల వారీగా పంచుకొనేశారు…మీరు ఏ కులానికి,మతానికీ, ప్రాంతానికీ సంబంధం లేనివారు కాబట్టి మిమ్మల్ని దాదాపు మరిచిపోయారు..జనం..
ఇప్పుడు “కులమే”అత్యంత శక్తివంతంగా మారిపోయింది,,మా జనరేషన్ కూడా పోతే మిమ్మలను గుర్తించుకొనేవారే వుండగపోవచ్చు.
మీరు కలలుగన్న గ్రామస్వరాజ్యం కనుమరుగైంది..మధ్యపానం యేరులైపారుతుంది..విద్య అంగడిలో అమ్మే ఖరీదైన వ్యాపారవస్తువైపోయింతి మహాత్మా….మరో చీలిక దిశగా భారత్ కదులుతుంది….
“వద్దు మహాత్మా,..మళ్ళీ ఈ దేశంలోనే పుట్టాలని అనుకోకండి…మీ లాంటి శాంతిమూర్తులకు ఇక్కడ స్తానం లేదు….
“” మీకు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం మహాత్మా!! అశ్రువులు నిండిన కళ్ళతో..బరువెక్కిన హృదయాలతో ,వణుకుతున్న గొంతులతో అరుస్తున్నాం,,,జోహార్లు…మహాత్మా…మీకు జోహార్లు!!!!!