ఆదోని : సంతానం లేని వారికి జూలై 2న పట్టణంలోని వాసవి కళ్యాణ మందిరంలో ఉచిత వైద్య పరీక్ష శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎన్ఆర్ఐ, ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు నగేష్ కాకుబాళ్ తెలిపారు.
శనివారం ఎస్‌కెడి కాలనీ 3వ రోడ్డులోని వైట్ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆవోపా, ఆవోప మహిళా విభాగ్ ఆధ్వర్యంలో కర్నూల్ ప్రైమ్ ప్లస్ ఫెర్టిలిటీ సెంటర్ వారి సౌజన్యంతో తన సొంత ఖర్చులతో ఉచితంగా ఐవఎఫ్ మెడికల్ కౌన్సిలింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సమాజ సేవ చేయాలనే సంకల్పంతో గతంలో రెండు ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహించి 252 మందికి ఆపరేషన్లు చేయించామన్నారు. కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో నిర్వహించిన ఆపరేషన్లకు వెళ్లిన వారికి రవాణా భోజన వసతి ఏర్పాటు చేయమన్నారు నిరుపేద కుటుంబాలు సైతం పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఒక్కొక్కరికి సుమారు రూ.25 వేలు విలువచేసే వైద్యాన్ని అందిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు వంకదారు శ్రీనాథ్ గుప్తా, మిరియాల శ్రీథర్ తెలిపారు.
శిబిరం నందు ఉచిత ఓపి, రిజిస్ట్రేషన్, స్త్రీ పురుషులకు ఉచిత సలహాలు రక్తపరీక్షలు, సలహాలు ఇవ్వడం, అర్హులైన వారికి వీర్య పరీక్షలు (సెమిన్ ఎనాలిసిస్ ), ఐయుఐ టెస్ట్, ఐవిఎఫ్ కన్సల్టెషన్ ఉచితంగా కర్నూల్‌లోని ప్రైమ్ ప్లస్ ఫెర్టిలిటీ సెంటర్‌లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సంతానం లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పేర్ల రిజిస్ట్రేషన్ కోసం 8977778184, 9550444641 సంప్రదించాలని కోరారు. ఇతర వివరాల కోసం 9849478178, 9490576399, 9849057205 నంబర్లకు సంప్రదించాలని కోరారు.ఈ సమావేశానికి సభ్యులు , ప్రతాప్ ఈరన్న, రాఘవేంద్ర, రంగనాయకులు, మహిళా విభాగ్ సభ్యులు సంగీత, మమతశ్రీ, హిమబిందు ఉన్నారు.