Table of Contents
AVOPA AP Educational Trust: Supporting Arya Vaishya Students Educational Dreams
ఆర్యవైశ్య విద్యార్థులకు AVOPA AP ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ మరియు ఆ పై తరగతుల విద్యను అభ్యసిస్తున్న ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్య విద్యార్థులకు AVOPA AP ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ద్వారా విద్యాభ్యాసం కోసం ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ గొప్ప కార్యక్రమం ఆర్థిక సాహాయం కొరకు దరఖాస్తు చేసుకోవడానికి కొన్ని ప్రత్యేక నిబంధనలు మరియు నియమాలు ఉన్నాయి.
దరఖాస్తు విధానం
దరఖాస్తు ప్రక్రియ సులభంగా మరియు పారదర్శకంగా ఉంటుంది.
- దరఖాస్తుదారులు అందజేసిన దరఖాస్తు పత్రాన్ని ప్రింట్ తీసుకొని, అందులోని అన్ని వివరాలను సరిగ్గా నింపి, సంబంధిత పత్రాలను జతచేసి, దాన్ని AVOPA బాలికల వసతి గృహం, 7/4 అరండల్ పేట, గుంటూరు నకు పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా పంపవలెను.
- వాట్సాప్ ద్వారా పంపే దరఖాస్తులు స్వీకరించబడవు.
నియమ నిబంధనలు
- స్థిర నివాసం: విద్యార్థి మరియు తల్లిదండ్రులు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే నివసిస్తున్న వారై ఉండవలెను.
- రెన్యువల్: రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గత సంవత్సరం పరీక్షలలో ఉత్తీర్ణులై ఉండవలెను. దరఖాస్తు పై భాగాన రెన్యువల్ అనే పదాన్ని మరియు గత సంవత్సరం తీసుకున్న మొత్తాన్ని సూచించవలెను.
- పరిశీలన: సంస్థ నియమ నిబంధనల మేరకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను బట్టి వచ్చిన దరఖాస్తులను పరిశీలన చేసి అర్హులైన వారికి మాత్రమే ఆర్థిక సహాయం అందించబడును.
- సహాయం పొందుట: ఆర్థిక సాయం పొందటానికి సంస్థ నిర్ణయించిన తేదీన విద్యార్థి మరియు తండ్రి తప్పనిసరిగా హాజరు కావలెను. ఒకవేళ తండ్రి లేనట్లయితే తల్లి హాజరు కావాల్సి ఉంటుంది.
- చివరి తేదీ: పూర్తి చేసిన దరఖాస్తులను పంపటానికి చివరి తేదీ ఆగస్టు 10.
- ఫీజు రసీదు: విద్యార్థి కళాశాల ఫీజులు చెల్లించినట్లయితే ఫీజు రసీదు జిరాక్స్ కాపీని తప్పనిసరిగా జతచేయవలెను.
- ఆర్థిక సాయం అర్హత: మేము అందించే ఆర్థిక సహాయం కంటే ఎక్కువ మొత్తాన్ని కళాశాల ఫీజుల రూపంలో చెల్లించిన వారు మాత్రమే ఈ ఆర్థిక సాయం పొందటానికి అర్హులు.
- సహాయం పరిమాణం: ఇంటర్మీడియట్ విద్యార్థులకు Rs. 10,000, బిటెక్ విద్యార్థులకు Rs. 15,000 మరియు అత్యున్నత విద్యాసంస్థలలో చదివే విద్యార్థులకు Rs. 25,000 వరకు ఆర్థిక సహాయం అందించబడును.
ఆర్యవైశ్య సంస్థల పాత్ర
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్యవైశ్య సంస్థల సభ్యులు ఈ అంశాలను మీ మీ ప్రాంతాల్లోని ఆర్యవైశ్య గ్రూపులకు పంపి, మన విద్యార్థులకు సహాయం చేయండి. దరఖాస్తుపై స్థానిక లేదా సమీప AVOPA అధ్యక్షుల సంతకం తప్పనిసరిగా ఉండవలెను. ఒకవేళ ఆ ఊరిలో AVOPA లేనట్లయితే ఏ ఆర్యవైశ్య సంస్థ అధ్యక్షుల సంతకమైన తప్పనిసరిగా ఉండవలెను. అలా సంతకాలు లేని దరఖాస్తులను పరిగణ లోనికి తీసుకోబడదు.
ముగింపు
AVOPA AP ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క ఈ కార్యక్రమం ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్య విద్యార్థులకు విద్యను అభ్యసించడానికి ఒక గొప్ప అవకాశం. మీ అర్హతను నిర్ధారించుకుని, సరిగ్గా నింపిన దరఖాస్తును సమర్పించి, ఈ సదావకాశాన్ని వినియోగించుకోండి.
Financial Assistance for Arya Vaishya Students through AVOPA AP Educational Trust
The AVOPA AP Educational Trust is offering financial assistance to economically disadvantaged Arya Vaishya students pursuing intermediate and higher education across Andhra Pradesh. This generous program has specific guidelines and rules for applying for financial aid.
Application Process
The application process is straightforward and transparent:
- Applicants should print the attached application form, fill in all the details accurately, attach the relevant documents, and send it via post or courier to AVOPA Girls Hostel, 7/4 Arundalpet, Guntur.
- Applications sent via WhatsApp will not be accepted.
Rules and Regulations
- Residency Requirement: The student and their parents must reside in Andhra Pradesh.
- Renewal Applications: Students applying for renewal must have passed their exams in the previous year. The word “Renewal” and the amount received last year should be mentioned at the top of the application.
- Evaluation: Applications will be reviewed based on available financial resources, and aid will be provided only to eligible candidates.
- Attendance Requirement: The student and their father must be present on the date specified by the organization to receive the financial assistance. If the father is not available, the mother must attend.
- Deadline: The deadline for submitting completed applications is August 10.
- Fee Receipt: If the student has paid the college fees, a photocopy of the fee receipt must be attached.
- Eligibility: Only those who have paid an amount greater than the financial assistance provided by the trust as college fees are eligible for this aid.
- Assistance Amount: Financial assistance up to Rs. 10,000 for Intermediate students, Rs. 15,000 for B.Tech students, and Rs. 25,000 for students in top educational institutions will be provided.
Role of Arya Vaishya Organizations
Members of Arya Vaishya organizations across the state are requested to disseminate this information to Arya Vaishya groups in their areas to help eligible students. The application must be signed by the local or nearest AVOPA president. If there is no AVOPA in the area, the application must be signed by the president of any Arya Vaishya organization. Unsigned applications will not be considered.
Conclusion
This initiative by the AVOPA AP Educational Trust provides a valuable opportunity for economically disadvantaged Arya Vaishya students to pursue their education. Ensure your eligibility, fill out the application accurately, and submit it on time to take advantage of this opportunity.
for more deatils conect Avopa