మన భారత భూమి వేద భూమి. సంస్కృతి ,సంప్రదాయాలకు, ఆధ్యాత్మిక భావనకు, ధర్మస్వరూపంనకు పెట్టింది పేరు. దాదాపు ఐదువేల సం.రాల క్రితం శ్రీకృష్ణ పరమాత్మ అర్జును డుకు ఉపదేశించిన భగవద్గీత ద్వారా మనకు కర్మ, జ్ఞాన, భక్తి మార్గాల నిర్దేశత్వం చేసారు.
శ్రీకృష్ణుని అవతార రహస్యం మన జీవన విధానానికి రెండు కళ్ళుగానే ప్రసిద్ధి పొందాయి. అటువంటి ధర్మమార్గాన్ని, భక్తి తత్త్వాన్ని ప్రజలకు విశిదపరచడానికి మన తెలుగు నేలమీద కూడా అనేకమంది యోగి పుంగవులు జన్మించారు.
రమణ మహర్షి, పుట్టపర్తి సత్యసాయి, కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ఇలా ఎందరో కారణజన్ములు. వారు చూపిన మార్గము మనకు ఆదర్శనీయము. ఇటువంటి కోవలోనే జన్మించినవారు బూర్లె రంగన్న బాబు గారు వీరి గురించి మనలో చాలామందికి తెలియదు.
బూర్లె రంగన్నబాబు (1895 – 1979 )
రంగన్న బాబు గారి స్వస్థలం ప్రకాశం జిల్లా. ఆయన తండ్రి పుల్లయ్య. తల్లి జాలమ్మ. బ్రతుకు తెరువు నిమిత్తం ఏలూరు వలస వచ్చారు. బరకాలు, గోనెసంచులు కుట్టి. సంసారాన్ని, పిల్లలను పోషించేవారు. రంగన్నబాబుకు చదువుకోలేదు. అందుకని తండ్రి జూటుమిల్లులో మంచినీళ్ళు కావిడి మోయడానికి పనిలో పెట్టాడు. ఖాళీ సమయాల్లో కొంతమందికి కూడా కావిడ్లతో నీటిని మోసేవాడు. ఆ రోజుల్లో నీటికి ఇబ్బంది పడేవారు. ఇలా నీటి కావిడులతో నీళ్ళు మోసి ఖాళీ దొరికినప్పుడు ఓ చెట్టుక్రింద కూర్చొని, వీరబ్రహంద్రస్వామిపై పాటలు పాడుకొంటుండగా, ఒక యోగి ఇతనిని సమీపించి, ”నాతో వస్తావా? పుణ్య క్షేత్రాలు చూపిస్తానని” అంటే, రంగన్నబాబు కనీసం ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండానే ఆ యోగితో వెళ్ళిపోయారు.
తరువాత ఇంట్లో వాళ్ళు కంగారుపడి, వెదికిినా ప్రయోజనం లేదు. ఆ యోగి పుణ్యక్షేత్రాలు తిప్పి త్రివేణీ సంగమంలో (ప్రయాగ) జరుగుతున్న కుంభాభిషేకానికి తీసు కొచ్చి, అక్కడే ఉన్న ఒక అఘోరా చేత జ్ఞానోదయం కల్పించారు. అప్పటి నుండే రంగన్నబాబు ‘రామధ్యానం’ చేస్తూ, శ్రీరామ భక్తుడై పోయాడు.
నిరంతరం ధ్యాన సమాధిలోనే ఉంటుండే వాడు. తిరిగి రెండు సం.రాలకు ఏలూరు వచ్చి, తన వృత్తిని మళ్ళీ మొదలెట్టినా, రామధ్యానం మానలేదు. తరువాత గుంటూరులోని జూటుమిల్లుకు నీరు సరఫరాకై వెళ్ళాడు.
ఒకరోజు పోలియోతో బాధపడుతూ కర్రల సహాయంతో నడుస్తున్న ఒక బాలుడిని చూసి రంగన్న కర్రలు తీసి నడవమని సూచించాడు. వెంటనే ఆ బాలుడికి పోలియో పోయింది. బజారులోని ఒకరు తన వ్యాపారం సాగట్లేదని, తగిన ఉపాయం చెప్ప మని కోరితే, నువ్వు శ్రీరామనామాలు రాసిన దండను కొట్టుముందున్న గుమ్మానికి కట్టమని సూచించాడు. రాముని కొలుస్తూండమని చెప్పా డు. తర్వాత, ఆ వ్యాపారం బాగా సాగుతున్నట్లు బాబుకు తెలిపారు.
ఈయన ప్రభావం తెలిసి భక్తులు దర్శనార్థం వస్తుంటే, ఒక ఫొటో గ్రాఫర్ కూడా వచ్చి, ఆయన ఫొటో తీసి, కడిగి చూస్తే, నల్లగా ఉంది తప్ప, ఆయన ఫొటో లేదు. అపుడు తన మిత్రునికి విషయం తెలిపితే ఆయన అనుమతి లేకుండా తీస్తే అలాగే ఉంటుదన్నారు. మర్నాడు మళ్ళీ వెళ్ళి, రంగన్నబాబు అనుమతితో తీస్తే, బాబుగారి గుండెల్లో కోదండరాముడు కొలువైనట్లు వచ్చింది. తర్వాత మళ్ళీ ఏలూరు వచ్చారు.
శ్రీ ఎక్కిరాల భరద్వాజుడుగారు ప్రచురిస్తున్న సాయి మాసపత్రిక లో ఈయన గురించి రాస్తే, శ్రీ ఎక్కిరాల వేదవ్యాస్గారు గుర్తించి, ఆయన వద్దకు వచ్చి దర్శనం చేసుకొని ఆధ్యాత్మిక, తాత్విక విషయాలు మాట్లాడుకొన్న తరువాత, మీ చేతుల మీదుగా ప్రసాదం తినాలని ఉందంటూ వేదవ్యాస్గారు కోరితే,, రంగన్నబాబు ఆకాశం లోకి చేయిచాపితే ఒక మధురమైన పండు వచ్చింది.
అప్పుడు వేదవ్యాస్గారు ఇదేమిఫలం?
అనడిగితే ఇది ”త్రి విక్రమ ఫలం” అని బదులు ఇచ్చారు. పిల్లలులేని వారికి సంతాన యోగం, అనారోగ్యంతో ఉన్నవారికి ఆరోగ్యం, ఇలా ఎన్నో మహిమలు చూపిన రంగన్న ఎప్పుడూ రామనామాన్ని వదల లేదు. ఆయన వద్దకు వచ్చిన వారితో జన్మకర్మలు, తాత్విక, ఆ ధ్యాత్మిక, విషయాలు మాట్లాడేవారు.
ఆయన గురించి చాలామందికి తెలియదు. ఆయన అనుగ్రహంతో పుట్టిన సంతతి ఇప్పటికీ ఏలూరు, గుంటూరులలో ఉన్నారు. ఇంత చేసినా, తనకు ఏమీ లేకపోయినా, ఎవ్వరి వద్ద నుండి ఏమీ స్వీకరిం చలేదు రంగన్నబాబుగారు.పూర్వ జన్మ సంస్కారంవల్ల, సాధారణ గృహిణులు, పురుషులు ఎవరైనా, ఆధ్యాత్మిక సాధనలో మహోన్నత స్థితికి చేరుకొంటారని చెప్ప డానికి ఎంతోమంది, అవధూతల జీవితాలే మనకు ఆదర్శం.
India, often referred to as the land of spirituality and philosophy, is the birthplace of some of the world’s most ancient and revered texts, the Vedas. It is a nation that has named itself after the Vedic heritage, symbolizing its rich culture, traditions, spiritual beliefs, and the embodiment of dharma. Nearly five thousand years ago, it was on this sacred land that Lord Krishna imparted the eternal wisdom of the Bhagavad Gita to Arjuna, guiding humanity on the paths of righteousness, knowledge, and devotion.
The avatar of Lord Krishna is celebrated as a pivotal moment in Indian ethos, marking a profound influence on life’s philosophy and spiritual evolution. This divine guidance has been the beacon for many yogis and spiritual leaders who were born in the Telugu-speaking regions of India, such as Ramana Maharshi, Sathya Sai Baba, and Chandrasekharendra Saraswati of Kanchi Kamakoti Peetham. These great souls have exemplified the path of righteousness and devotion, leaving an indelible mark on the spiritual landscape.
Among such illustrious figures was Burle Ranganatha Babu (1895 – 1979), whose life journey began in the Prakasam district. Son of Pullayya and Jalamma, he moved to Eluru in search of livelihood, engaging in humble occupations to support his family. Despite his lack of formal education, Ranganatha Babu was deeply spiritual. His life took a transformative turn when a yogi approached him with an invitation to visit sacred places, an offer he accepted without a second thought, leaving without informing his family.
This decision led him to the Triveni Sangam at Prayag, where he experienced a spiritual awakening under the guidance of an Aghori. From that moment, Ranganatha Babu became a devout follower of Lord Rama, dedicating his life to meditation and contemplation. Even after returning to Eluru and resuming his work, his devotion to Rama never wavered.
His spiritual prowess became known when he miraculously cured a boy suffering from polio and provided divine guidance to a struggling businessman. His reputation as a healer and sage grew, attracting many seekers. However, when a photographer attempted to capture his image, the photo appeared blank, a phenomenon attributed to his spiritual stature.
Ranganatha Babu’s legacy continues through his descendants in Eluru and Guntur. His life, devoid of material desires, was a testament to the power of faith and the spiritual heritage of India. His teachings and life story remain an inspiration, demonstrating that through sincere spiritual practice, even ordinary individuals can attain exalted states of consciousness, following the examples set by the great ascetics of India.