నమస్తే వాసవి దేవి – నమస్తే విశ్వ పావని
నమస్తే వ్రత సంబద్దే -నమస్తేకౌమారితేనమోనమ:
శ్రీమంతమైనది జైష్టశైలమునసత్యంబు దర్మంబు, శశ్వత యశము నీతి బోదనకెల్ల నెలకొల్పినట్టి
శ్రీ వాసవి కన్యక వందనములివిగో వాసవాంబ!
ఆర్యులు మద్య ఆశియా నుండి వచ్చిరి.వీరు వృత్తిబేదము ననుసరించి మూడు తెగలు రవిడివడిరి.అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులని మహభారతంలో వైశ్య బుషులుముగ్గురు కనిపిస్తారు.వైశ్యులు వ్యవసాయ, పారిశ్రామిక వృత్తులు చేపట్టారని, బహు ప్రాచీన గ్రంధమైన బుగ్వేదములోఉంది. వైశ్యుల మూలపురుషుడు
కుబేరుడని వైశ్యపురాణం చాటుతున్నవి.బౌద్దుల త్రిపీఠకాల్లో వైశ్యుల చరిత్ర ఉంది
కృషి గోరక్షణ, వాణిజ్యం వీరి ప్రదాన వృత్తులు.ఈ విషయం మహబారతంలో ఉంది.
వైశ్యులుఅనాదినుండి వైదిక మతస్థులుతిక్కనబారతంలో,శ్రీనాధుని కావ్యంలో వైశ్య శబ్దానికి పర్యా యం గా కోమటి శబ్దం వాడబడింది వైశ్యులు కేవలం వ్యాపారులు మాత్రమే కాక, రాజులుగా, మంత్రులు, గా సేనానులుగా, ఉన్నట్లు శాసనాలు తెలుపుచున్నవి.ప్రతి ప్రబందం లోను పుర వర్ణనలోనువైశ్యుల గొప్పతనం వర్ణించబడింది.
కోమటి శబ్ద నిర్వచనం
సాహిత్యంలో తిక్కన, వేములవాడ బీమకవి శ్రీ నాదుడు,కోమటి శబ్దం వాడారు.ఈ శబ్దం
“గోమతి లేక “గోమఠ”శబ్దంనుండివచ్చినదంటారు వైశ్యుల పెద్దలను శ్రేష్టి , శెట్టి, అని పిలుస్తారు.
కోమట్లకు వర్తక సంబందమైన రహస్య బాష ఉందని E.దర్ స్టన్ అనే పండితుడు తన గ్రందంలో వ్రాశాడు.వైశ్యులు దర్మనిరతులుగా, తపోనిష్ట గలవారు గా వాసికెక్కారు. ప్రాచీన కాలంలో 714 గోత్రాలు కలిగి ఉన్నారు.
వేదకాలం నాటి చాలుర్వర్ణ వ్యవస్థలో కనిపించే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకీ ఇప్పుడు
తెలుగు నేల మీద జీవిస్తున్న బ్రాహ్మణ, క్షత్రియ ,వైశ్యులకి ఎంత వరకు సంబందమున్నది అనేది ముఖ్యప్రశ్న వైశ్యుల వరకు పరిమితమైన సమాదానాన్ని కొంత అన్వేషిoచాలి – – – –
బుగ్వేదం నాటి ఆర్యవైశ్యులకు బుషి గోత్రాలు ఉంటవి. వారు తొలుత వ్యవసాయాన్ని తర్వాత వాణిజ్యాన్ని ,వృత్తిగా చేపట్టి జీవించిన వారు.
కోమట్లుగా పిలువబడే పెనుగొండ వైశ్యులు ఈవైశ్యులకు వారసు లా — — – –
నన్నె చోదుడి కాలం నాటికే కోమట్లు
(కుమార సంభవం 7-12 ) పదం వాడుకలో ఉంది శ్రీనాదుడు పలనాటి చరిత్రలో కోమటి, కుమతి,కోమలి, గోమటి, గోమత్.గోమత, గోమతి, గోమూఢ, ఇవన్ని మానార్దాలని వివిద పరిశోదకులు రాశారు “కార్పటిక” కోమటి అయినదని సూర్య రాయం ద్రని షుoటువు సూచించింది తెలుగువారిలో కోమటి-కన్నడంలో కూడ కోమటి గాను తమిళం, మళయాళంలో కోమట్టి గాను, తుళు బాషలో కోమటి, గోమటిగె గాను కనిపిస్తారు.
వీరి చరిత్ర తెలుగు నేలపై రూపుదిద్దుకున్న చరిత్రలో ముడిపడి నడిచింది. క్రీ.పూ.5వ శతాబ్దము బుద్దుడు జీవించిన కాలం ఆనాటి కృష్ణాతీరంలో స్దానికులుగా రెండు ప్రధాన జాతుల వారు కనిపిస్తారు. ఒకరు యక్షులురెండో వారు నాగులు, యక్షులలో అదికులు వర్తక వర్గాలకు చెందిన వారుగా రాణిం
చినారు. నాగులు మాత్రం ఉత్పాదకులుగా గుర్తింపు పొందారు. నాగులు, యక్షుల మధ్య అనేక మనస్పర్ద లు నడుస్తూన్న రోజులవి , వాళ్ళను అదుపు చేసి శాంతి మార్గాన వారు నడిచేలా చేసారు బుద్దుడు బౌద్ద మతంవీరికి సహకరించింది. కుబేరుడు యక్ష రాజుల్లో ప్రసిద్దుడు రావణుడు లంక నుంచి తరిమివేసిన అతని సోదరుడు కుబేరుడు వీరు ఒక రేకా వచ్చు లేదా వీరి వంశీకులు కావచ్చు.
ఈ కుబేరుడు కృష్ణాతీరంలో విస్తరించి వర్తక వాణిజ్యములు చేసి కోట్లకు పడగలెత్తారు
ఆనాటి అపూర్వ సంపద కారణాంతరము వలన భూ స్థాపితం కాగా ఇప్పటికి కృష్ణానది అటు ఇటు కూడ భూమిలోంచి సానబట్టి నవజ్రా లు అప్పుడు బైటపడుతుంటావి ఆ సంపద ఒకనాటి యక్షులదే కావచ్చు కోమట్ల అవతరణ గురించి క్రీ||శ తొలి శతాబ్దం లోనే తెలుగు నేలపైన బౌద్ధం జనాదరణ కోల్పోయి, జైనం పునరుజ్జీవం పొందింది.అయినా చాలా శతాబ్దాల కాలం ఈదనిక శ్రేష్టులు క్రమంగా జైనంలోకి ప్రవేశించటం తప్పనిసరి అవసరం అయింది.
బట్టిప్రోలు శాసనములో ధనదుడి – కథ ఆనాటి సమాజంలో జైన -బౌద్ద మతాల మధ్యపరివర్తనకు తార్కాణం గా నిలుస్తుంది. ఇలా కొన్ని కులాలు ఒక మతం నుంచి ఇంకో మతంలోకి మూకుమ్మడిగా మారడం చాలా సార్లు జరిగింది. కర్ణాటక గోమతీ నదీతీరంలోని గోమఠాదిపతితో ఏర్పడిన భక్తి సంబందాల రీత్యా శ్రేష్టి కులజులంతా గోమఠ జై నాన్ని స్వీకరించారు. ఈగోమఠ జైనులలో గోమఠంవారుగోమటు లుగా జనవ్యావహరికంలోకి కోమట్లుగామారారు.
ఇంతలో క్రీ||శ 6 వ శతాబ్దములో శైవమత ప్రభువులు వచ్చారు.వీరి ప్రాబల్యము పెరిగినాక జైనులు, బౌద్దులు నామరూపాలు లేకుండా పోయారు.వీరితరువాత ఎనిమిది వందల సంవత్సరములు తెలుగు కన్నడ ప్రాంతాలలో శైవమతం బాగా కొనసాగింది. ఈ దశలో వణిజశ్రేష్టులుగా వున్న గోమటులు తమ స్థావరాన్నిబట్టి ప్రోలు నుండి పెనుగొండకు మారినారు. శైవమతం స్వీకరించి వైదికంలోకి మొదటి సారిగా ప్రవేశించారు. జైనం కారణంగా ఏర్పడిన శాఖాహర భోజనం’ సాదు తత్వం, వైశ్యులు ఈనాటి వరకు అలానే ఉన్నారు. అప్పటి నుండి వైశ్యులకు పెనుగొండ ప్రధాన స్థావరమైనది.
రాజరాజనరేందృని కాలమున అనేక పరిణామాల మధ్య కన్యకాపరమేశ్వరి అవతరించి పెనుగొండ క్షేత్రము పుణ్య క్షేత్రంగా మారింది.
ఈ వైశ్యుల 714 గోత్రాల వారిలో కొంతమంది వైశ్యులు దశ బుషి గోత్రాలను తగిలించుకొన్నారు. మరి కొందరు పేర్ల పేర్లకు “ఆర్య ” అనతగిలించుకొని తము బుగ్వేదకాలం నాటి వారమని చెప్పుకునేవారు. 15వ శతాబ్దములో అనంతపురం శాసనంలో ఒకవైశ్య వంశం తమకు అగస్త్యుడు పురోహితుడని చెప్పటం దీనికి ప్రబల సాక్ష్యo ఈ పరిణామాలలో వై శ్యులలో కోమట్లుగా మారకుండా మిగిలిన వారు ప్రత్యే కగుర్తింపు కోసం క్రీ॥శ1424 – 1442 నాటి విజయనగరం రాజుగారి కోర్టులో ఈ వివాదం చర్చకు వచ్చింది వచ్చినపుడు కోమట్లు, వైశ్యులు ఒకరేనని 18 పట్టణంలలో 108 దేవాలయాలలో అందరు వ్వాపారం చేసుకొనవచ్చ ని తీర్పు చెప్పారని అంటారు పెద్దలు ఇలా వైశ్యులు కోమట్లుగా మారడం వెనుక ఈ సమాజిక నేపద్యమువున్న
వైశ్యులదాన దర్మాలు
శ్రీకన్యకాపరమేశ్వరి పవిత్రనామంతో అనాది నుండి వైశ్యులు విరివిగా దానదర్మాలు చేస్తూ ఉన్నారు దర్మము, త్యాగము, సేవా కార్యక్రమములలో ముందుండేది వైశ్యులని బౌద్ద గాదలలో అందమైన తన శిరోజాపను కత్తిరించి అమ్మి వేసి ఎనిమిది మంది బిక్షకులకు అన్నం పెట్టిన ఒక పేదరాలైన వైశ్య కన్య చరిత్ర చిరస్మరణీయం . అన్నిదానాలకన్న అన్నదానం గొప్పదని గుర్తించిన శ్రేష్టుల వైశ్యులు. వైన్యకు మారై అయిన విశాఖ 27 కోట్ల రూపాయలతో ఆరామం నిర్మించినది. ఈ దర్శ చరిత్రలో సువర్ణ అక్షరాలలో లిఖింపదగినది. పాహియాన్ అనే చైనా యాత్రికుడు పాటలీపుత్రంలో వైద్యశాలలకు దర్మశాలలకు వైశ్యులు ముందులు దానం చేసే వారని ప్రాశాడు.అశోకుని బార్యవైశ్య కన్య. అమె వల్లనే అశోకుడంతటి వాడయ్యడు. కామాజిరాజు హర్షుడు వైశ్య కుల సంజాతుడు ఇతడు దర్మ కార్యాలు చేయడంలో నిద్రాహరామానుకున్నాడని హుయాన్ త్సాంగు రాశాడు.
వైశ్యులు – విద్యాసేవ
వైశ్యులు – విద్యాసేవలో ఎంతో ప్రసిద్ది పొందారు శ్రీహర్షుడు వైశ్య ప్రభువు కాలంలో నలందా విశ్వవిద్యా లయం. గ్రందాలయం చాల ప్రశిద్ది పొందినది ఈ విశ్వవిద్యాలయo జంబూద్వీపంలోకెల్లా గొప్పది. నలందా విద్యాలయంనకు కావలసిన స్థలమును 500 మంది వర్తకులు, 10 లక్షల బంగారు నాణలు బుద్దుని సమర్పంచినారు హర్షుడు నిత్యం 1000 మంది బిక్షకులకు, 500 మంది బ్రాహ్మణులకు దానాలుచేసేవాడు ఈ సర్వ దానం రోజు అనేక మంది
పండితులను, కవులను సన్మానించేవారట. తక్షశిల నుండి మధుర వరకు అనేక పుణ్యశాల లువైశ్య ప్రముఖుల చే నిర్మించబడినవే. మనదేశంలో ఈనాడు చేస్తున్న వైశ్యుల విద్యాసేవ నిరుపమానం. ప్రస్తుతం లక్షలాది విద్యార్డులకు – విద్యా దానం చేస్తున్న కళాశాలలు వైశ్యులచే నర్మించబడినవే అంతేగాక వైశ్యుల వితరణతో విద్యా రివసతి గృహములనేఖం నిర్మించబడినవి.
అనేక చోట్ల శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి పేరిట గ్రందాల యములు సైతం నడపబడుతు విజ్ఞానాన్ని వెదజల్లుతు సేవానిరతినివైశ్యుల వితరణను వేయినోళ్ళ చాటుతున్నవి.
యుద్ద వీరులుగావైశ్యులు
వైశ్యులు వీరులై అనేక యుద్దాలు చేసినట్లు చరిత్ర చెపుతున్నది. బొబ్బలియుద్దంలో బేరి కోమటూ స్త్రీలు రాళ్ళతో యుద్ధం చేసినట్లు ఉన్నది.వీరిలో బేరి రామక్క పరాక్రమం విశిష్టమైనది ప్రేంచి వారి తుపాకి గుండ్లకు ఈ వీర వనిత బలి అయినది.
పల్నాటి యుద్దములో బాలచంద్రుని బొంగరాల టనుమానియుద్దమునకువెళ్ళునట్లు చేసినది ఒక వైశ్య వృద్ద వీరాంగన వీరోచితమైన సంభాషణ అనిపల్నాటి చరిత్రచెపుతున్నది.
ఈ సంఘటన మేడపి దగ్గర జరిగింది.
102 గోత్రాల వారికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కులదేవతయి వెలసింది.
పెనుగొండ క్షేత్రమునుచూచి తరించండి.
శ్రీకన్యకాపరమేశ్వరిమాతాకు జై