కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భక్తులు బంగారం చీరను కానుకగా అందజేశారు. 3 కేజీల బంగారంతో రూ. 2 కోట్లు విలువ చేసే చీరను తయారు చేయించారు భక్తులు. శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి సంక్షేమ భక్తసంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామీ, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేతుల మీదుగా ఈ చీరను అమ్మవారికి అందజేశారు. 110 సంవత్సరాల క్రిందట నిర్మించిన వాసవి అమ్మవారి ఆలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఎక్కడ లేని విధంగా.. ఇక్కడ ఆర్య వైశ్య సంఘం నేతలు బంగారు చీరను తయారు చేసి బహుకరించడం గొప్ప విషయమని ప్రశంసించారు కొలగట్ల వీరభద్రస్వామి.
గత నెల కూడా విజయనగరం కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో వాసవి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి ఉత్సవాల్లో భాగంగా వాసవి మాతను బంగారం చీర, వజ్ర కిరీటంతో అలంకరించారు. ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. బంగారు చీరలో అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు.