ఈ రోజు ఢిల్లీలో కేంద్ర పర్యాటక & సాంస్కృతిక మంత్రివర్యులు శ్రీ జి.కిషన్ రెడ్డి గారిని కలసి EWS రిజర్వేషన్ల సమస్యల పై వినతిపత్రం సమర్పించడం జరిగింది….
గౌరవనీయులైన,
శ్రీ కిషన్ రెడ్డి గారికి…..
కేంద్ర పర్యాటక & సాంస్కృతిక మంత్రివర్యులు….
విషయం : వినతి పత్రాలకు సానుకూల స్పందన వచ్చే విధంగా చొరవ తీసుకోవాలని మనవి….
కేంద్ర క్యాబినెట్ మంత్రిగా పదోన్నతి పొందిన మీకు రెడ్డి జాగృతి ప్రత్యేక అభినందనలు తెలుపుతుంది. సాధారణ కార్యకర్త గా ప్రారంభించి దినదిన ప్రవర్ధమానంగా కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా స్థాయికి చేరుకున్న మీ కృషి అభినందనీయం. మెడికల్ కళాశాలలో 10 శాతం రిజర్వేషన్స్ అమలు చేసినందుకు మీ ద్వారా భారత ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
యువత ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విషయమై స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీకి, వ్యవసాయ అభివృద్ధి , వ్యవసాయ అనుబంధ రంగాలలో యువతకు ఉపాధి విషయమై మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ కు మరియు EWS రిజర్వేషన్స్ సవరణలకు , అమలుకు ,
జాతీయ స్థాయి కమీషన్ & కార్పొరేషన్ ఏర్పాటు గురించి మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ & ఎంపవర్ మెంట్ శాఖకు వినతిపత్రాలు సమర్పించడం జరిగింది…..
ఈ విషయమై, మీరు ప్రత్యేక చొరవ తీసుకొని 3 వినతిపత్రాలకు సానుకూల స్పందన వచ్చే విధంగా కృషి చేయాలని విన్నవించుకుంటున్నాము.
కృతజ్ఞతలు !!!
ACPS జాతీయ అధ్యక్షుడు
మీ….ప్రేమ్ గాంధీ